మకర సంక్రాంతి శుభాకాంక్షలు....!!
- January 15, 2016
గొప్పవారి పుట్టినరోజులు వస్తే చాలు జనాలకు బోలెడు నీతి వాక్యాలు గుర్తుకు వచ్చేస్తాయి... కనీసం వాటిలో మనం ఒక్కటి అయినా పాటిస్తున్నామో లేదో గుర్తుకే రాదు... ఎదుటివారికి చెప్పేటందుకే నీతులు అన్నది మాత్రం మహ చక్కగా పాటించేస్తాం తూ.చ తప్పకుండా... ఎంతయినా ఈ విషయంలో మన వాళ్ళని మాత్రం మెచ్చుకోవాలి.. ప్రతి ఒక్కరికి ఈ రోజు వివేకానందుడు, మొన్న అబ్దుల్ కలాం ఆదర్శం అని నాకు ఈరోజే తెలిసింది.. మనకు ఇక ఏ చట్టాలు, న్యాయాలు అవసరం లేదేమో.. అన్ని సజావుగానే జరిగి పోతాయి.. దేశ నాయకుల నుంచి పల్లెల వరకు అందరికి ఈ ఇద్దరు ఆదర్శమే కదా...
అయిన వాళ్ళ అవసరాలు చూడటం తెలియదు గాని దీనజనోద్దరణకు బయలుదేరతాం... మనలో చెడు ఆలోచనని తగ్గించుకుని ఎదుటి వారిలో కాస్త మంచిని చూడటం అలవాటు చేసుకోగలిగితే కొద్దిగానయినా ఈ పెద్దలు చెప్పిన సద్ది మూటల్లో ఆణి ముత్యాలను ఏరుకున్న వాళ్ళం కాగలుతాం... వాళ్ళు పుట్టిన ఈ పుణ్యభూమిలో పుట్టినందుకు మనమూ గర్వపడదాం... అందరికీ భోగి, మకర సంక్రాంతి శుభాకాంక్షలు....
----మంజు యనమదల
తాజా వార్తలు
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..
- షార్జాలో ఎతిహాద్ రైల్ స్టేషన్కు మూడు కొత్త బస్సు మార్గాలు
- నన్ను అరెస్ట్ చేయొచ్చు..అయినా వెనక్కి తగ్గం: అభిజీత్ దీప్కే
- ఐదు వారాల్లో తొలిసారి వారాంతపు పతన దిశగా డాలర్







