ఒరిజినల్ జాబ్ కాంట్రాక్ట్‌లను భద్రపరచాలి
- January 28, 2016
మినిస్ట్రీ ఆఫ్ లేబర్, జాబ్ కాంట్రాక్టుల విషయమై ఎంప్లాయర్లకు (యజమానులకు) స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. జాబ్ కాంట్రాక్టులను భద్రపరచాలనీ, సంతకం లేదా వేలి ముద్ర తప్పనిసరిగా జాబ్ కాంట్రాక్టులపై ఉండాలని స్పష్టంగా వెల్లడించింది మినిస్ట్రీ. ఇరు పార్టీల (యజమాని, ఉద్యోగి లేదా కార్మికుడు) వద్దా జాబ్ కాంట్రాక్టులు ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. వర్క్ పర్మిట్స్‌కి సంబంధించి ఇటీవల జారీ చేసిన కొత్త మార్గదర్శకాలను వివిధ సంస్థల యజమానులు స్వాగతిస్తున్నారు. సంస్థల నిర్ణయాన్ని అభినందించారు మినిస్టర్ ఆఫ్ లేబర్ సక్ర్ ఘోబాష్. కార్మికులకు సంబంధించి, సంస్థలకు సంబంధించి వివాదాలు తలెత్తుతున్నందున జాబ్ కాంట్రాక్టులతోపాటు, వాటిపై సైన్ చేస్తున్న సమయంలో తీసిన ఫొటోలను కూడా భద్రపరచాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. కార్మికులు తమ హక్కుల గురించి తెలుసుకోవాలనీ, అలాగే సంస్థలు ఉద్యోగుల హక్కులపై అవగాహన కల్పించాలనీ, వివాదాలు తగ్గేందుకు ఇరువర్గాలు సహకరించాలని అధికారిక వర్గాలు వెల్లడించాయి.
తాజా వార్తలు
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!







