పార్టీ భారీ విజయ సంబరాలు తెలంగాణ భవన్ లో..
- February 05, 2016
గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల్లో ఊహించినదాని కంటే అధికార టీఆర్ఎస్ ఘనవిజయం దిశగా దూసుకెళ్తుండటంతో ఆ పార్టీ నాయకులు సంబరాల్లో మునిగిపోయారు. పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్ లో పండగ వాతావరణం నెలకొంది.గ్రేటర్ ఎన్నికల కౌంటింగ్ శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కాగా, అప్పటికే టీఆర్ఎస్ నాయకులు తెలంగాణ భవన్ కు చేరుకున్నారు. ఎన్నికల ఫలితాలను తెలుసుకునేందుకు సర్వత్రా ఆసక్తి చూపారు. టీవీల ద్వారా ఎప్పటికప్పుడు ఎన్నికల ఫలితాలను తెలుసుకుంటూ.. పార్టీ భారీ విజయం సాధించే సంకేతాలు వెలువడటంతో పార్టీ నాయకులతో సంతోషం పంచుకున్నారు. టీఆర్ఎస్ సొంతంగా మేయర్ పదవిని దక్కించుకునే అవకాశం ఉండటంతో టీఆర్ఎస్ నాయకుల సంబరం అంబరాన్ని తాకింది.మంత్రులు తెలంగాణ భవన్ కు వెళ్తున్నారు. టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు రంగులు చల్లుకుని న్యత్యాలు చేశారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







