ట్రంప్ ఇంకా పూర్తిగా కోలుకోలేదు...మాస్క్ తీసేసి.!
- October 06, 2020
కోవిడ్ బారిన పడిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చాలా వరకు కోలుకున్నారు. వాల్టర్ రీడ్ మెడికల్ సెంటర్ లో నాలుగు రోజుల పాటు అత్యవసర చికిత్స పొందిన అనంతరం ఆయన తిరిగి వైట్ హౌస్ చేరుకున్నారు. అయితే వైట్ హౌస్ కి వెళ్లగానే ట్రంప్ మాస్క్ తీసేసి కెమెరాల ముందుకు వచ్చి మాట్లాడారు.

'ఇప్పుడే వాల్టర్ రీడ్ మెడికల్ సెంటర్ నుండి వచ్చాను. ఈ సందర్భం నిజంగా చాలా ప్రత్యేకమైనది' అని ట్రంప్ ట్విట్టర్లో పోస్ట్ చేసిన ఓ వీడియో సందేశంలో పేర్కొన్నారు. కరోనా గురించి చాలా తెలుసుకున్నానని, ఒక్క విషయం మాత్రం కచ్ఛితంగా గుర్తు పెట్టుకోవాలని. కరోనాని మనపై గెలుపు సాధించనీయకూడదని అన్నారు. కరోనాకు భయపడకూడదని, దానిని జయించవచ్చని. ఈ మధ్యకాలంలో మంచి మందులు, వైద్య సాధనాలు అందుబాటులోకి వచ్చాయని, తప్పకుండా మనం దానిని జయించగలమని. ట్రంప్ చెప్పారు.
'నా ఆరోగ్యానికి హాని కలిగే అవకాశం ఉందని తెలిసినా. నాయకుడిగా ముందుండి నడిపించాను, ఏ నాయకుడు అలా చేయడు. ప్రమాదం ఉందని నాకు తెలుసు. అయినా సరే నేను చేయాల్సింది చేశాను. ఇప్పుడు నేను బాగున్నాను. నాకు రోగనిరోధక శక్తి బాగా ఉండి ఉండవచ్చు.' అన్నారాయన.
ట్రంప్ కి చికిత్స చేసిన వైద్య బృందం ఈ విషయంపై స్పందిస్తూ. ట్రంప్ ఇంకా పూర్తిగా కోలుకోలేదని, అయితే ఇంటికి వెళ్లగల స్థితిలో ఉన్నారని, ఆయన ఆక్సిజన్ స్థాయి సాధారణంగా ఉందని. ఐదవ డోస్ రెమ్ డెసివిర్ ని వైట్ హౌస్ లోనే తీసుకుంటారని తెలిపారు. అక్టోబర్ 15న మియామిలో డెమొక్రాటిక్ పార్టీకి చెందిన జో బిడెన్ తో జరగనున్న అధ్యక్ష చర్చలో పాల్గొనాలని ట్రంప్ భావిస్తున్నారని ఆయన ప్రచార ప్రతినిధి టిమ్ ముర్తాగ్ తెలిపారు.
— Donald J. Trump (@realDonaldTrump) October 5, 2020
తాజా వార్తలు
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్
- కేంద్ర విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ప్రహ్లాద్ జోషి..
- విమానాల రద్దు పై వస్తున్న వార్తలు అవాస్తవం.. సాధారణంగానే సేవలు: కువైట్ ఎయిర్వేస్
- డిసప్పియర్ ఇంక్‌తో చెక్కు.. ఓ అరబ్ వ్యక్తికి షాకిచ్చిన దుబాయ్ కోర్టు..!!
- కువైట్ లో బాటిల్ వాటర్ కొనుగోలుపై పరిమితి కొనసాగింపు..!!







