కువైట్ సిటీ :కువైట్ ఉప ప్రధాని, అంతర్గత శాఖ మంత్రి అనస్ ఖలేద్ నస్సెర్ అల్ సలెహ్ తో భారత రాయబారి సిబి జార్జ్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా కువైట్-భారత్ మధ్య పలు రంగాల్లో పరస్పర సహకారాన్ని, ఇరుదేశాల మధ్య సంబంధాల బలోపేతంపై చర్చించారు. అదే సమయంలో కువైట్ లో ప్రవాసీయుల సంక్షేమానికి సంబంధించి పలు అంశాలను చర్చించనట్లు తెలుస్తోంది. మరోవైపు కోవిడ్ 19 ఎదుర్కునేందుకు ఇరు దేశాలు పరస్పరం సహకారంపై చర్చించారు. భారత సమాజం పట్ల కువైట్ ప్రభుత్వం చూపిస్తున్న ఆదరణకు సిబి జార్జ్ ధన్యవాదాలు తెలిపారు.