FTPC ఇండియా ఆధ్వర్యంలో నేషనల్ డాక్టర్స్ డే జాతీయ పురస్కారాలు
- June 19, 2026
హైదరాబాద్: ఫిల్మ్ అండ్ టెలివిజన్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (FTPC) ఆధ్వర్యంలో జులై 1న నేషనల్ డాక్టర్స్ డే ను పురస్కరించుకుని జాతీయ స్థాయిలో వివిధ రంగాలలో గణనీయమైన వైద్య సేవలందించిన పలువురు వైద్యులకు జాతీయ పురస్కారాలు అందిస్తున్నట్లు సంస్థ అధ్యక్ష, కార్యదర్శులు చైతన్య జంగా, పాకలపాటి విజయ వర్మ మీడియాతో మాట్లాడుతూ తెలిపారు. సమాజంలో వైద్యుల పాత్ర ఎంతో కీలకమని రోగుల ప్రాణ రక్షణలో వైద్యులు అందిస్తున్న సేవానిరతికి చిహ్నంగా ఈ పురస్కరాలను అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆర్థొపెడిక్, గ్యాస్ట్రో, కార్డియాక్, వెరీకోజ్, కాస్మోటిక్ వంటి వివిధ రంగాల్లో విశిష్ట వైద్య సేవలను అందించిన వైద్యులను గుర్తించి జులై 1న సాయంత్రం బషీరాబాగ్‌లోని సురవరం ప్రతాపరెడ్డి ఆడిటోరియంలో ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ రామ్‌చంద్ర నాయక్, హైదరాబాద్ ఆదాయపన్ను శాఖ కమిషనర్ డి.జె.ప్రభాకర్ ఆనంద్, మిస్ ఏషియా ఇంటర్నేషనల్, మిస్ ప్లానెట్ ఇండియా, మిస్ ఏపి, మిస్ బ్యూటీఫుల్ ఐస్, రష్మీ ఠాకూర్ విచ్చేస్తారని తెలిపారు. వీరితో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరవుతారని చెప్పారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. విలేకరుల సమావేశంలో ఎఫ్‌టిపిసి సభ్యులు షానీ సాల్మన్, కవిత, కిరణ్ బెజాడి, కోడే చైతన్య, ఎం.ఈశ్వర్, జి.మధుకర్, రామిశెట్టి అప్పారావు, తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- CJP తీరు పై స్టూడెంట్స్ విమర్శలు!
- సౌదీలో కొత్త హౌజింగ్ నిర్మాణ విధానానికి కేబినెట్ ఆమోదం..!!
- కువైట్‌లో నకిలీ ప్రభుత్వ స్టాంపుల ముఠా గుట్టురట్టు..!!
- యూఏఈలో వర్కర్లను నియమించుకునే వారికి కీలక సూచనలు..!!
- అమీర్‌తో మాట్లాడిన అమెరికా అధ్యక్షుడు..!!
- ఒమాన్‌లో ఆగస్టులో ఎండల తీవ్రత అధికం..!!
- షిర్డీ సాయిబాబాకు బంగారు ‘రామ్’ అక్షరాన్ని కానుకగా సమర్పించిన దుబాయ్ భక్తులు
- 25 టన్నుల కల్తీ మసాలా దినుసులు సీజ్ : సిపి సజ్జనార్
- మద్యం మత్తులో డ్రైవింగ్.. బహ్రెయిన్‌లో ఘోర ప్రమాదం
- యంగ్ ఇండియా పోలీస్ స్కూల్‌కు జాతీయ స్థాయి గుర్తింపు లక్ష్యం: డీజీపీ సీవీ ఆనంద్







