కువైట్ లో వేడి, తేమతో కూడిన వాతావరణ పరిస్థితులు..!!
- June 19, 2026
కువైట్: కువైట్ లో ఈ వారాంతంలో పగటిపూట, ముఖ్యంగా తీర ప్రాంతాలలో వేడి మరియు తేమతో కూడిన వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం ఉపరితల అల్పపీడనం విస్తరించే దశలో ఉందని, దీనితో పాటు వేడి మరియు తేమతో కూడిన గాలుల తీవ్రత అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ తాత్కాలిక డైరెక్టర్ అబ్దుల్ అజీజ్ అల్-ఖరావి తెలిపారు. పగటిపూట వాతావరణం చాలా వేడిగా ఉంటుందని హెచ్చరించారు. గరిష్ట ఉష్ణోగ్రతలు 45 నుండి 47°C మధ్య ఉండే అవకాశం ఉందన్నారు. ముద్రపు పరిస్థితులు తేలికపాటి నుండి మధ్యస్థంగా ఉంటాయని, అలల ఎత్తు 1 నుండి 4 అడుగుల వరకు ఉంటుందన్నారు. రాత్రి సమయాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 26 నుండి 28°C మధ్య ఉండే అవకాశం ఉండగా, సముద్రపు అలలు 1 నుండి 3 అడుగుల వరకు ఉంటాయన్నారు.
ఇక శుక్రవారం ముఖ్యంగా తీర ప్రాంతాలలో, పరిస్థితులు వేడిగా మరియు తేమగా ఉండే అవకాశం ఉంది. గంటకు 8 నుండి 32 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. గరిష్ట ఉష్ణోగ్రతలు 43 నుండి 45°C మధ్య ఉంటాయని, కనిష్ట ఉష్ణోగ్రతలు 24 నుండి 26°C మధ్య ఉంటాయన్నారు. శనివారం వేడిగా, తేమగా ఉంటుందని, గంటకు 6 నుండి 26 కిలోమీటర్ల వేగంతో తేలికపాటి గాలులు వీస్తాయని అల్-ఖరావి తెలిపారు. గరిష్ట ఉష్ణోగ్రతలు 43 నుండి 45 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యే అవకాశం ఉందని, కనిష్ట ఉష్ణోగ్రతలు 30 నుండి 32 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంటాయని తెలిపారు.
తాజా వార్తలు
- భారత్–షార్జా ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం పై చర్చలు
- ట్రాఫిక్ రద్దీ తగ్గించేందుకు డ్రైవర్లకు కీలక సూచనలు..!!
- సౌదీ ప్రజలకు భారత కాన్సుల్ జనరల్ శుభాకాంక్షలు..!!
- బంధువుల మధ్య వివాహాలతో జన్యు వ్యాధుల ముప్పు.. డాక్టర్ల హెచ్చరికలు..!!
- ఓపెన్ ప్రిజన్స్ ప్రోగ్రామ్.. ఖైదీల కళల్లో శాంతి సందేశాలు..!!
- యూఎన్ఓలో ఖతార్ అమిర్ ప్రసంగానికి దౌత్యవేత్తల ప్రశంసలు..!!
- ముత్రా కేబుల్ కార్ భద్రతా ఏర్పాట్లపై సమీక్ష..!!
- ఇంట్లోకి చొరబడి కాల్పులు, 11 మంది మృతి
- ఆసియా-పసిఫిక్లో ఏరో ఇంజిన్ సేవల విస్తరణకు జీఎంఆర్ ఏరో టెక్నిక్–స్టాండర్డ్ ఏరో భాగస్వామ్యం
- యూపీఐ ఛార్జీలపై NPCI కీలక ప్రకటన







