TOMCOM ఆధ్వర్యంలో ఇజ్రాయెల్‌లో కేర్ గివర్స్‌కు భారీ ఉద్యోగ అవకాశాలు

- June 19, 2026 , by Maagulf
TOMCOM ఆధ్వర్యంలో ఇజ్రాయెల్‌లో కేర్ గివర్స్‌కు భారీ ఉద్యోగ అవకాశాలు

అర్హులైన అభ్యర్థులకు నెలకు రూ.1.99 లక్షలకు పైగా వేతనం

హైదరాబాద్: తెలంగాణ ఓవర్సీస్ మాన్‌పవర్ కంపెనీ లిమిటెడ్ (TOMCOM) ఆధ్వర్యంలో ఇజ్రాయెల్‌లో కేర్ గివర్స్ (వృద్ధుల సంరక్షణ) ఉద్యోగాల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.1.99 లక్షలకు పైగా వేతనం అందనున్నట్లు సంస్థ వెల్లడించింది.

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 25 నుంచి 45 సంవత్సరాల మధ్య ఉండాలి. ANM, GNM, MPHW, MPHA, పేషెంట్ కేర్ డిప్లొమా లేదా బీఎస్సీ నర్సింగ్ విద్యార్హత కలిగి ఉండాలి.

అలాగే కనీసం రెండేళ్ల సంబంధిత అనుభవం ఉండటంతో పాటు అనుభవ ధ్రువీకరణ పత్రం తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుంది. ఇంగ్లిష్ భాషలో ఇంటర్మీడియట్ స్థాయి (CEFR-B2) ప్రావీణ్యం అవసరమని సంస్థ పేర్కొంది.

ఇజ్రాయెల్ వీసా నిబంధనల ప్రకారం మెడికల్ ఫిట్‌నెస్ తప్పనిసరి కాగా, వసతి మరియు ఆహార ఖర్చులు వర్తిస్తాయని వెల్లడించింది.

ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడంతో పాటు తమ బయోడేటాను (సీవీ) ఇమెయిల్ ద్వారా పంపించవచ్చు.

దరఖాస్తు లింక్:
https://forms.gle/ArSLi7kt8AENSvDS8

సీవీ పంపాల్సిన ఇమెయిల్:
[email protected]

సంప్రదింపు నంబర్లు:
94400 51763
94400 49645
94400 52081
98496 39539

విదేశాల్లో ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న నర్సింగ్ మరియు పేషెంట్ కేర్ రంగాల అభ్యర్థులకు ఇది మంచి అవకాశమని TOMCOM అధికారులు తెలిపారు.

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com