నారాయణ్ ఖేడ్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ విజయ దుందుభి ..
- February 16, 2016
నారాయణ్ ఖేడ్ ఉప ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ విజయ దుందుభి మోగించింది. తొలి రౌండ్ నుంచే స్పష్టమైన మెజార్టీతో దూసుకుపోయింది. వరంగల్, గ్రేటర్ లో వెలుగుచేసిన ఫలితాల సరళే నారాయణఖేడ్ లోనూ కొనసాగింది. మంగళవారం జరిగిన ఓట్ల లెక్కింపులో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి భూపాల్ రెడ్డి 53,625 ఓట్లతో ఘనవిజయం సాధించారు.టీఆర్ఎస్ అభ్యర్థి మహారెడ్డి భూపాల్ రెడ్డికు 93,076 ఓట్లు పోల్ అయ్యాయి. కాంగ్రెస్ అభ్యర్థి పటోళ్ల సంజీవరెడ్డికి 39,451 ఓట్లు దక్కాయి. టీడీపీ నుంచి పోటీలోఉన్న విజయపాల్ రెడ్డికి కేవలం 14,787 ఓట్లు, నోటాకు 853 ఓట్లు పడ్డాయి.
ఉప ఎన్నికల్లో సానుభూతి ఓట్లతో గెలుస్తామనుకున్నా కాంగ్రెస్ పార్టీకు నిరాశే మిగిలింది.
చివరకు డిపాజిట్ దక్కించుకుని పరువు నిలుపుకుంది. కాంగ్రెస్ పార్టీకి సిట్టింగ్ స్థానమైన ఖేడ్ లో ఆ అభ్యర్థి సంజీవరెడ్డి రెండో స్థానానికే పరిమితమయ్యారు. ఇప్పటికే తెలంగాణలో ఉనికి కోల్పోయే ప్రమాదంలోపడ్డ టీడీపీ ఇక్కడ కూడా డిపాజిట్ కోల్పోయింది.
రౌండ్లవారీగా మూడు పార్టీలకు పోలైన ఓట్లు, ఆధిక్యత వివరాలు..
రౌండ్ నెంబర్ టీఆర్ఎస్ ఆధిక్యం కాంగ్రెస్ టీడీపీ
1 3,922 1,952 1,970 701
2 3990 2,003 1,987 832
3 4,730 3,347 1,383 1,608
4 4,635 2,360 2,275 712
5 4,387 1,903 2,484 1,043
6 4,024 2,590 1,434 664
7 4,529 3,211 1,318 1,110
8 4,429 2,606 1,823 793
9 4,863 2,558 2305 295
10 4,558 2,781 1,777 551
11 5,008 2,582 2,426 735
12 5,032 3,301 1,731 635
13 5,399 3,370 2,029 415
14 5,669 4,098 1,571 331
15 5,129 3,044 2085 580
16 3,774 2,393 1381 614
17 4,555 2,243 2,312 761
18 3,374 1,151 2,223 1,128
19 5,199 3,120 2,079 463
20 4,484 2,491 1,993 485
21 1384 519 865 105
మొత్తం 93,076 53,625 39,451 14,787
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







