గోబీ కోఫ్తా కర్రీ
- February 21, 2016
కావలసిన పదార్థాలు: కాలీఫ్లవర్: మీడియం సైజుది, టమోటాలు: మూడు(ముక్కలు చేసుకోవాలి), ఉల్లిపాయలు: రెండు(చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి), మొక్కజొన్న పిండి: 50 గ్రాములు, పచ్చిమిరపకాయలు: మూడు లేదా నాలుగు, కారంపొడి: రెండు టేబుల్ స్పూన్లు, అల్లం వెల్లుల్లి ముద్ద: రెండు టేబుల్ స్పూన్లు, టమోటా సాస్: మూడు టేబుల్ స్పూన్లు, జీలకర్ర: మూడు టేబుల్ స్పూన్లు, ఉప్పు: రుచికి సరిపడ, నూనె: తగినంత, కొత్తిమీర: కొద్దిగా, శనగపిండి: 50 గ్రాములు
తయారీ విధానం: కాలీఫ్లవర్ను విడదీసి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గిన్నెలో శనగపిండి, మొక్క జొన్న పిండి, కారం, అల్లంవెల్లుల్లి ముద్ద, జీలకర్ర, ఉప్పు వేసి కొద్దిగా గంటెజారుగా కలుపుకోవాలి. బాండీలో తగినంత నూనె పోసి కాగిన తరువాత పై మిశ్రమంలో ముక్కలు వేసి దోరగా వేయించుకొని పక్కన పెట్టు
కోవాలి. ఉల్లిపాయ ముక్కలు కొన్నింటిని, టమోటా ముక్కలను కలిపి ముద్దగా చేసుకొని అదే నూనెలో కొన్ని ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర, వేసి వేయించుకోవాలి. ఇవి బాగా వేగిన తరువాత అల్లం వెల్లుల్లి ముద్ద, మిగిలిన కారం, టమోటా సాస్, రుబ్బిపెట్టుకున్న ఉల్లిపాయ మిశ్రమాన్ని వేసి కొద్దిసేపు ఉడికించాలి. ఇది గట్టిపడుతున్న సమయంలో వేయించిపెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలను జత చేసుకోవాలి. సన్నపు సెగన కూర గట్టిపడేంత వరకూ ఉడికించాలి. దించే ముందు కొత్తిమీర చల్లుకోవాలి. ఇది వేడి వేడి అన్నం లేదా చపాతీల్లోకి మంచి రుచిగా వుంటుంది.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







