కోవిడ్ రికవరీ పేషెంట్లకు కూడా వ్యాక్సిన్

- March 13, 2021 , by Maagulf
కోవిడ్ రికవరీ పేషెంట్లకు కూడా వ్యాక్సిన్

యూఏఈ: కోవిడ్ నుంచి కోలుకున్న వారు కూడా ఇక నుంచి వ్యాక్సిన్ తీసుకోవచ్చని యూఏఈ అధికారులు వెల్లడించారు. కోవిడ్ లక్షణాలు స్వల్పంగా ఉన్నా, అసలు లక్షణాలు లేకుండా ఉన్న వారికి ఎలాంటి వైద్య పరీక్షలు లేకుండానే నేరుగా వెళ్లి వ్యాక్సిన్ తీసుకొచ్చని క్లారిటీ ఇచ్చింది.  అయితే..ఇన్ఫెక్షన్ సోకి లక్షణాలు తీవ్రంగా ఉంటే మాత్రం వారికి కొన్ని వైద్య పరీక్షలు అవసరం అవుతాయని యూఏఈ ఆరోగ్యశాఖ అధికార ప్రతినిధి తెలిపారు. లక్షణాలు తీవ్రంగా ఉంటే వారి శరీరంలో రోగ నిరోధక శక్తి వృద్ధి తగిన స్థాయిలో ఉందా లేదా పరీక్షించి రోగ నిరోధక శక్తి తగిన స్థాయిలో లేకపోతే వ్యాక్సిన్ ఇస్తామని చెప్పారు. అమెరికా కూడా కోవిడ్ నుంచి రికవరీ అయిన వారు వ్యాక్సిన్ తీసుకోవటం ఉత్తమమని తమ పౌరులకు పిలుపునిస్తున్న విషయాన్ని ఆమె గుర్తు చేశారు. ఓ సారి కోవిడ్ బారిన పడి కోలుకున్న వారికి రెండో సారి వైరస్ సోకే అవకాశాలు అరుదు. అయినప్పటికీ రెండోసారి కూడా ఇన్ఫెక్షన్ సోకే ముప్పు ఉన్నందువల్ల రికవరీ పేషెంట్లు కూడా వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించారు. అయితే..మోనోక్లోనల్ యాంటీబాడీస్, ప్లాస్మా ట్రీట్మెంట్ ద్వారా ఇన్ఫెక్షన్ నుంచి కోలుకున్న వారు 90 రోజుల తర్వాతే వ్యాక్సిన్ తీసుకోవాలని స్పష్టం చేశారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com