ఆత్మహత్యకు ప్రేరేపించేలా వీడియోలు పోస్ట్ చేస్తున్న వ్యక్తి అరెస్ట్
- March 13, 2021
కువైట్: పిల్లలను ఆత్మహత్యలకు ప్రేరేపించేలా వీడియోలను పోస్ట్ చేస్తున్న కువైట్ వ్యక్తిని క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు తన సోషల్ మీడియాలోని అకౌంట్ ద్వారా ఏ విధంగా ఆత్మహత్య చేసుకోవచ్చో పలు వీడియోలను పోస్ట్ చేస్తుండే వాడు. ఆ వీడియోల ద్వారా పిల్లలను ఆత్మహత్యలకు పురికొల్పుతున్నట్లు నిందితుడు పలువురు క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ కు ఫిర్యాదు చేశారు. దీంతో అలర్టైన అధికారులు వెంటనే దర్యాప్తు చేపట్టారు. అతడి సోషల్ మీడియా అకౌంట్ పై నిఘా వేసి..తమకు వచ్చిన ఫిర్యాదులు నిజమేనని నిర్ధారించారు. ఎత్తైన ప్రదేశాల నుంచి దూకటం వంటి ఆత్మహత్యల రకాలను పోస్టు చేస్తూ పిల్లలు సూసైడ్ చేసుకునేలా ప్రేరేపిస్తున్నట్లు వెల్లడించారు. దీంతో అతన్ని అరెస్ట్ చేశారు. ఈ ఘటనతో అప్రమత్తమైన అంతర్గత మంత్రిత్వ శాఖ..ఇంట్లో పిల్లలపై పెద్దలు ఓ కన్నేసి ఉంచాలని పిలుపునిచ్చారు. మొబైల్, కంప్యూటర్ ఇతరాత్రా కమ్యూనికేషన్ సాధాణాలను వాళ్లు ఉపయోగించుకుంటన్న తీరుపైనా నిఘా ఉంచాలన్నారు. పిల్లల భవిష్యత్తుతో చెలగాటమాడితే సహించబోమని..ఎవరైనా వ్యక్తులు అనుచితంగా ప్రవర్తిస్తున్నట్లు గమనిస్తే వెంటనే ఎమర్జెన్సీ ఫోన్ 112కి ఫోన్ చేసి సమాచారం అందించాలని మంత్రిత్వ శాఖ సూచించింది.
తాజా వార్తలు
- ఏపీలో ఎన్నికల పై సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు..
- మొబైల్ ఫోన్ గొడవ..ఇద్దరి హత్యకు దారి
- దుబాయ్లో ఘనంగా స్పార్క్ మీడియా 5వ వార్షిక బతుకమ్మ సంబరాలు 2026
- సౌదీ అరేబియాలో భారతీయులకు భారత రాయబార కార్యాలయం కీలక సూచనలు
- కువైట్లో చిన్నారుల కోసం ‘ఫ్రీడమ్ ఫ్రమ్ గాడ్జెట్స్’ కార్యక్రమం
- షార్జాలో ఇంధన వాసనపై ఆందోళన వద్దు.. పరిస్థితి అదుపులోనే ఉంది: అధికారులు
- మక్కాలో అనుచిత చర్యల వీడియోపై తప్పుడు ప్రచారం.. స్పష్టం చేసిన హోలీ మాస్క్స్
- బహ్రెయిన్ రాజు హమద్తో ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ భేటీ..
- బరాకా అణు విద్యుత్ కేంద్రం ఘటన పై యూఏఈ స్పందనకు IAEA ప్రశంసలు
- ఇరాన్ 75వేల మందిని హత్య చేసింది: ట్రంప్ సంచలన ఆరోపణలు







