అత్యుత్తమ ఫీడ్‌బ్యాక్ వచ్చిన జిల్లాకు అవార్డు : రాహుల్ బొజ్జా
- March 02, 2016
జిల్లాలో 9.3 లక్షలకుపైగా జన్‌ధన్ ఖాతాదారులు-ఢిల్లీలో పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన కలెక్టర్ రాహుల్‌బొజ్జా జన్‌ధన్ యోజన పథకం అమల్లో భాగంగా హైదరాబాద్ జిల్లా ప్రధానమంత్రి అవార్డు రేసులో పోటీపడుతోంది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన జన్‌ధన్ యోజన పథకం కింద జిల్లాలో 9,31,170 మంది బ్యాంకు ఖాతాలు తెరిచారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో ఈ పథకం అమలు తీరుపై మార్చి 1న కలెక్టర్ రాహుల్‌బొజ్జా ఢిల్లీలో పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఇందులో భాగంగా బ్యాంకు లింకేజీలతో అమలవుతున్న ఇన్సూరెన్స్, కార్పొరేషన్ రుణాలు, స్కాలర్షిప్లు, స్వయం సహాయక గ్రూపులకు చెందిన బ్యాంకు ఖాతాలపై కలెక్టర్ కేంద్రానికి నివేదక సమర్పించారు.అయితే, దేశవ్యాప్తంగా ఈ అవార్డుకు సుమారు 20 జిల్లాలు పోటీ పడుతున్నాయి. తెలంగాణ నుంచి హైదరాబాద్‌తోపాటు రంగారెడ్డి జిల్లా సైతం పోటీ పడుతోంది. ఆయా జిల్లాల కలెక్టర్ల నివేదికలు, పవర్‌పాయింట్ ప్రజెంటేషన్లతోపాటు ఖాతాదారుల నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకొని.. అత్యుత్తమ ఫీడ్‌బ్యాక్ వచ్చిన జిల్లాకు అవార్డు ప్రకటించేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటుంది. దీనిపై త్వరలోనే ఓ స్పష్టత వస్తుందని కలెక్టర్ రాహుల్ బొజ్జా
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం







