అమేజాన్ డెలివరీ గర్ల్స్..!!
- March 04, 2016
సాధారణంగా హోం డెలివరీ పనికి యువకులనే నియమిస్తుంటారు. అయితే ఇప్పుడా రంగంలో అమ్మాయిలను ప్రోత్సహిస్తోంది ప్రముఖ ఈ-కామర్స్ పోర్టల్ అమేజాన్. పార్సిల్ డెలివరీకి అమ్మాయిలకూ అవకాశమిస్తూ, వేతనాలు కూడా అబ్బాయిలతో సమానంగా ఇస్తోంది. ఈ అమేజాన్ ఏంజెల్స్ సేవలు తొలుత ఈ ఏడాది జనవరిలో కేరళలో ప్రారంభమయ్యాయి. ఇప్పుడు తమిళనాడు రాజధాని చెన్నైకి విస్తరించాయి. త్వరలోనే మరిన్ని ప్రాంతాల్లో మహిళలకు అవకాశం ఇవ్వనున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ అమ్మాయిలు ద్విచక్రవాహనాలపై డెలివరీ స్టేషన్‌కు 2 నుంచి 3 కి.మీ. ల దూరంలో ఉండే ప్రాంతాల్లో, సుమారు రోజుకు 40 దాకా పార్సిల్స్ డెలివరీ చేస్తున్నారు. చాలా మంది మహిళలు ఈ ఉద్యోగం చేయడానికి ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోందని.. మహిళలకు మరిన్ని ఉద్యోగాలు కల్పించడానికి, వారిని ప్రోత్సహించడానికి తాము సిద్ధంగా ఉన్నామని అమేజాన్ ఇండియా ప్రతినిధి పేర్కొన్నారు. భద్రతను దృష్టిలో ఉంచుకుని వారికి ఉదయం 7 నుంచి రాత్రి 7గంటల లోపలే వారి సేవలు వినియోగించుకుంటున్నట్లు తెలిపింది. డ్రైవింగ్ లైసెన్సు, ఇంగ్లిష్ చదవడం, రాయడం... తెలిసివుండడం కనీస అర్హతలు. ప్రస్తుతం తిరువనంతపురం, చెన్నైలలో అమేజాన్ ఏంజెల్స్ సేవలందిస్తున్నారు. ఏప్రిల్‌లో కేరళలోని కొచ్చిలో కూడా ఈ సేవలు ప్రారంభిస్తామని సంస్థ ప్రతినిధి తెలిపారు.
తాజా వార్తలు
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!







