‘వీసా నిషేధం’ ఇంకో 6 నెలల పొడిగింపు
- June 02, 2015
కన్‌స్ట్రక్షన్ రంగంలో వర్కర్స్‌కి వీసా నిషేధాన్ని మరో ఆరు నెలలు పొడిగించింది ఒమాన్ ప్రభుత్వం మంత్రివర్గ నిర్ణయం ప్రకారం ఈ బ్యాన్ పొడిగింపు జరిగినట్లు అధికారికంగా వెల్లడయ్యింది. 2013 నవంబర్ నుంచి తాత్కాలిక బ్యాన్ అమల్లో వుంది. విదేశాల నుంచి వచ్చే కన్‌స్ట్రక్షన్స్ వర్కర్స్‌కి ఈ వీసా బ్యాన్ వర్తిస్తుంది. దఫ దఫాలుగా వీసా బ్యాన్ పొడిగిస్తూ వస్తున్న ఒమన్ ప్రభుత్వం మరోమారు పొడిగిస్తుండగా, తాజా బ్యాన్ జులై 1, 2015 నుంచి అమల్లోకి వస్తుంది. మినిస్ట్రీ ఆఫ్ మేన్ పవర్ నుంచి ‘ఎక్స్‌లెంట్’ రేటింగ్ పొందిన కంపెనీలకు ఈ బ్యాన్ వర్తించదు. అంతర్జాతీయ సంస్థలు, కన్సల్టెన్సీకంపెనీలు, ప్రభుత్వ ప్రాజెక్టుల్ని చేపడ్తున్న సంస్థలూ ఈ బ్యాన్ నుంచి మినహాయింపు పొందాయి. నిర్మాణ రంగం కాస్త ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ మంత్రివర్గ నిర్ణయాల్ని గౌరవించక తప్పదనీ, కంపెనీలో సకాలంలో ప్రాజెక్టుల్ని పూర్తి చేయడానికి ప్రత్యామ్నాయ మార్గాల్ని అన్వేషించాల్సి ఉందని అల్ షబ్బి గ్లోబల్ ఎల్‌ఎల్‌సి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ అహ్మద్ హమౌద్ అల్ షబ్బి చెప్పారు.
--నూనె లెనిన్ కుమార్ (ఒమాన్)
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్‌లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







