హైదరాబాద్ లో ఘనంగా బోనాల పండుగ
- July 24, 2021
హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో బోనాల ఉత్సవాల సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. గత ఏడాది కరోనా కారణం గా నిడారంభరంగా జరిగిన బోనాల వేడుకలు ఈ సారి ఎంతో ఘనంగా జరుగుతున్నాయి.మత సామరస్యనికి ప్రతీక ఐన భాగ్యనగరం లో హిందువులు ,ముస్లింలు కలిసి ఘనOగా బోనాల ఉత్సవాలు జరుపుకుంటున్నారు.ఇప్పటికే గోల్కొండ లో బోనాల సందడి జోరుగా సాగుతుంటే...రేపు సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి బోనాలు జరగనున్నాయి.లష్కర్ బోనాల పై టీవీ5 స్పెషల్ ఫోకస్.
తెలంగాణ సంస్కృతీ కి సంప్రదాయాలకు అద్దం పట్టే బోనాల పండుగ సంబురాలు భాగ్య నగరం లో అంబరాన్ని అంటూతున్నాయి. అయితే నగరం లో జరుగుతున్న బోనాల వేడుకలు ఓ ఎత్తు ,లష్కర్ లో జరుగుతున్న బోనాల సంబురాలు మరో ఎత్తు. ఆషాఢ మాసం కావడం తో భాగ్యనగరం లో ఎక్కడ చూసినా బోనాల సందడి తో ఆద్యాత్మిక శోభ సంతరించుకుంది. హైదరాబాద్ నగరం లో జరుగుతున్న బోనాల ఉత్సవాలలో లష్కర్ బోనాలకు ఓ ప్రత్యేక స్థానం ఉంది. 1813 వ సంవత్సరం లో సికి0ద్రాబాద్ కు చెందిన సురిటి అప్పయ్య అనే భక్తుడు మద్యప్రదేశ్ లోని ఉజ్జయినీ మిలటరీ లో పనిచేస్తూ ఉండగా.... ఉజ్ఙయినీ లో కలరా వ్యాధి సోకి వేలాది మంది మృత్యు వాత పడ్డారు. అప్పుడు... అప్పయ్య ఉజ్జయినీ లోని మహాoకాళి అమ్మవారిని దర్శించుకుని , కలరా నుంచి ప్రజలను రక్షిస్తే సికిoద్రాబాద్ లో నిన్ను ప్రతిష్ఠి చేసి ,ఆలయం నిర్మించి పూజలు చేస్తామని ఉజ్జయినీ మహాoకాళీ అమ్మవారికి మొక్కు కున్నాడు.
తాజా వార్తలు
- ఖతార్లో అక్టోబర్ 16న ‘ఫెస్టివల్ ఆఫ్ వెకేషన్ అండ్ ఫన్’..!!
- యూఏఈలో ఫేస్ మాస్కుల రీకాల్.. నాణ్యత లోపాలపై హెచ్చరిక..!!
- సౌదీ అరేబియాలో 2026 మిస్క్ గ్లోబల్ ఫోరం రద్దు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో బీభత్సం..!!
- టీమ్ ఇండియాలో కొత్త ఆల్రౌండర్.. !
- కువైట్లో ర్యాష్ డ్రైవింగ్.. ప్రభుత్వ ఆస్తులకు నష్టం..!!
- ఒమన్, అర్మేనియా చర్చలు..పలు కీలక అంశాలపై సమీక్ష..!!
- బహ్రెయిన్ పౌరులకు విద్యుత్, నీటి బిల్లుల్లో ఊరట..!!
- అబుదాబి–రియాద్ విమాన సర్వీసులు రద్దు.. అక్టోబర్ 19 వరకు నిలిపివేత
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన







