కేటీఆర్ జన్మదినోత్సవం సందర్బంగా రక్తదాన శిబిరం,హరిత హారంలో పాల్గొన్న మేయర్ విజయలక్ష్మి
- July 24, 2021
హైదరాబాద్: రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కె.టి.రామారావు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని రక్త దాన శిబిరాల ప్రారంభోత్సవం,పెద్ద ఎత్తున మొక్కలు నాటడం తదితర కార్యక్రమాలను నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిర్వహించారు. జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాధ్ ఆధ్వర్యంలో కోట్ల విజయ భాస్కర్ రెడ్డి స్టేడియంలో జరిగిన రక్త దాన శిభిరాన్ని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ తో కలసి మేయర్ విజయ లక్ష్మి ప్రారంభించారు.డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతా శోభన్ రెడ్డి, కార్పొరేటర్ బాబా ఫసియొద్దీన్ తదితరులు పాల్గొన్న ఈ రక్తదాన శిబిరం ప్రారంభోత్సవ కార్యక్రంలో మేయర్ విజయలక్ష్మి మాట్లాడుతూ,యువ నాయకులు నగర అభివృద్ధి ప్రదాతగా ఉన్న కేటీఆర్ జన్మదినవోత్సవం సందర్బంగా రక్తదానం చేయడం అంటే మరొకరికి ప్రాణ దానం చేయడమేనని పేర్కొన్నారు.ఈ సందర్బంగా రక్తదానం చేసిన ప్రతి ఒక్కొక్కరినీ మేయర్ అభినందించారు. అనంతరం,లేక్ వ్యూ బంజారా చెరువు వద్ద నిర్వహించిన ముక్కోటి వృక్షార్చనలో మేయర్ విజయ లక్ష్మి పాల్గొని మొక్కలు నాటారు.నగరాన్ని హరితమయం చేయడంలో భాగంగా ముక్కోటి వృక్షార్చన లోభాగంగా నేడు ఒక్క రోజులోనే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పది లక్షల మొక్కలు నాటుతున్నామని వివరించారు.నగరంలో స్వచ్చంద సంస్థలు, యువజన సంఘాలు,ప్రజా ప్రతినిధులు,మహిళా సంఘాల తో కలసి నేడు ఈ పది లక్షల మొక్కల నాటే కార్యక్రమంలో భాగస్వామ్యులను చేశామని అన్నారు.

తాజా వార్తలు
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!







