ర్యాఫిల్ డ్రాలు, స్క్రాచ్ అండ్ విన్ క్యాంపెయిన్ల కోసం యాప్ ప్రారంభం
- July 26, 2021
దుబాయ్: కంపెనీలు, మరియు వినియోగదారుల కోసం ర్యాఫిల్ డ్రాలు, అలాగే, స్క్రాచ్ మరియు విన్ క్యాంపెయిన్ల నిమిత్తం కొత్త డిజిటల్ వేదికను దుబాయ్ ఎకానమీ ప్రారంభించింది. ఈ తరహా తొలి ప్రభుత్వ డిజిటల్ వేదిక ఇది. అమ్మకందార్లు, ర్యాఫిల్ డ్రాలను సమర్ధవంతంగా నిర్వహించేందుకుగాను ఈ వేదికను ప్రత్యేకంగా పలు రకాలైన సౌకర్యాలతో రూపొందించారు. వినియోగదారులు కూడా చాలా తేలిగ్గా ఈ యాప్ ద్వారా ర్యాఫిల్ డ్రాలలో పాల్గొనవచ్చు. కూపన్లు, బహుమతులు,ర్యాఫిల్ డ్రాల గురించి పూర్తి సమాచారం ఇక్కడ లభ్యమవుతుంది. ఇదే వేదిక పై నుండి విజేతలను కూడా ప్రకటిస్తారు.మెహజూజ్ మరియు దుబాయ్ డ్యూటీ ఫ్రీ ర్యాఫిల్స్ ప్రస్తుతం కొన్ని క్యాంపెయిన్లను నిర్వహిస్తున్నాయి.గూగుల్ ప్లే స్టోర్, అలాగే యాపిల్ స్టోర్ నుండి ఈ దుబాయ్ ర్యాఫిల్స్(Dubai Raffles) యాప్‌ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







