అబుధాబికి వెళ్ళే ప్రయాణీకులకు సంబంధించి గ్రీన్ లిస్ట్ సవరణ
- August 21, 2021
అబుధాబి: డిపార్టుమెంట్ ఆఫ్ కల్చర్ మరియు టూరిజం అబుధాబి (డిసిటి - అబుధాబి), సవరించిన గ్రీన్ లిస్టుని వెల్లడించింది.అబుధాబికి వెళ్ళే ప్రయాణీకులకు సంబంధించి ఈ గ్రీన్ లిస్ట్ విడుదల చేశారు. అల్బేనియా, ఆస్ట్రేలియా, ఆస్ట్రియా, బహ్రెయిన్, బెల్జియం, బ్రూనై, బల్గేరియా, కెనడా, చైనా, జెక్ రిపబ్లిక్, జర్మనీ, హాంగ్ కాంగ్, హంగేరీ, మాల్టా, మారిషస్, మాల్డోవా, న్యూజీలాండ్, పోలాండ్, ఐర్లాండ్, రొమేనియా, సౌదీ అరేబియా, సెర్బియా, సీషెల్స్, సింగపూర్, సౌత్ కొరియా, స్వీడెన్, స్విట్జర్లాండ్, తైవాన్, ప్రావిన్స్ ఆఫ్ చైనా, ఉక్రెయిన్ ఈ గ్రీన్ లిస్టులో వున్నాయి. 20 ఆగస్టు నుంచి ఈ లిస్ట్ అమల్లోకి వచ్చింది. ప్రయాణానికి 28 రోజుల ముందు రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తి చేసుకుంటే, అలాంటివారికి అబుధాబి మరియు బహ్రెయిన్, గ్రీస్, సెర్బియా, సీషెల్స్ మధ్య ప్రయాణం చేసినప్పుడు క్వారంటైన్ అవసరం వుండదు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







