హైదరాబాద్ నుంచి మాలె విమాన సర్వీసులు పున:ప్రారంభం
- August 22, 2021
హైదరాబాద్: జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ (GHIAL) ఈ రోజు హైదరాబాద్ నుండి మాల్దీవులలోని మాలేకు విమాన సర్వీసును పున:ప్రారంభించింది. ఇండిగో ఈ విమాన సర్వీసును ప్రారంభించింది. జీఎంఆర్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చెందిన సీనియర్ అధికారులు, ఇండిగో అధికారులతో పాటు, ఇతర విమానాశ్రయ భాగస్వాములు టెర్మినల్ వద్ద ప్రయాణీకులు, సిబ్బందికి వీడ్కోలు పలికారు.
_1629632118.jpg)
ఇండిగో విమానం 6E 8108 మధ్యాహ్నం 2.20 గంటలకు హైదరాబాద్ విమానాశ్రయం నుండి బయలుదేరి సాయంత్రం 4.30 గంటలకు మాల్దీవులలోని వెలానా అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో 6E 8107 రాత్రి 08.50 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది. హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం, మాలే మధ్య ఆగస్టు 22 నుంచి వారానికి మూడుసార్లు (మంగళవారం, గురువారం, ఆదివారం) ఈ విమానాలు నడుస్తాయి. అక్టోబర్ 15 నుంచి ఇవి వారానికి నాలుగుసార్లు (సోమవారం, బుధవారం, శుక్రవారం, ఆదివారం) నడుస్తాయి.
జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ సీఇఓ ప్రదీప్ పణికర్ మాట్లాడుతూ “హైదరాబాద్, మాలేలను కలిపే ఈ నూతన సర్వీసుతో ప్రయాణికులు మాల్దీవులలో బీచ్ అందాలను ఆస్వాదించవచ్చు. సాహస ప్రియులు, ప్రకృతి ప్రేమికులు, సెలవులకు వెళ్ళేవారు ఈ విమాన సర్వీసును ఎంతో ఇష్టపడతారు. జీఎంఆర్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి నూతన జాతీయ, అంతర్జాతీయ గమ్యస్థానాలకు సర్వీసులను ప్రారంభించడానికి ఎయిర్ లైన్స్ చాలా ఆసక్తి చూపుతున్నాయి’’ అన్నారు.
విలియం బౌల్టర్, చీఫ్ కమర్షియల్ ఆఫీసర్, ఇండిగో, ‘‘“దక్షిణ భారత ప్రజల కోసం ఈ ప్రత్యేక సర్వీసు ద్వారా మునుపెన్నడూ లేని అంతర్జాతీయ గమ్యస్థానాన్ని అందిస్తున్నాం.మాల్దీవులు భారతీయులకు ఇష్టమైన గమ్యస్థానం. ఈ నూతన సర్వీసు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాలకు చెందిన వారికి ఆహ్లాదకరమైన అనుభవాన్ని అందిస్తుంది.’’ అన్నారు.
_1629632129.jpg)
హైదరాబాద్ దక్షిణ, మధ్య భారతదేశానికి ప్రవేశ ద్వారం లాంటిది. అలాగే చాలా మంది ఇష్టపడే అతిపెద్ద రవాణా కేంద్రం. విజయవాడ, విశాఖపట్నం, నాగ్‌పూర్, భువనేశ్వర్, రాజమండ్రి, భోపాల్, తిరుపతి నుండి వచ్చే ప్రయాణీకులు జాతీయ, అంతర్జాతీయ గమ్యస్థానాలకు వెళ్లడానికి హైదరాబాద్ ను ఎంచుకుంటారు.
వాటర్ స్పోర్ట్స్ ప్రియులు, అడ్వెంచర్ స్పోర్ట్స్ ప్రేమికులు, హనీమూన్‌కు వెళ్లే జంటలకు మాల్దీవులు అత్యంత ఇష్టపడే ప్రదేశం. రోజువారీ యాంత్రిక జీవితం నుంచి తప్పించుకొనేందుకు ఇది చాలా అనువైన టూరిస్టు కేంద్రం. మాలేలోని కృత్రిమ బీచ్‌లో కయాకింగ్, వేక్‌బోర్డింగ్, స్కూబా డైవింగ్, కాటమరాన్ సెయిలింగ్ వంటి ఆకర్షణీయమైన జల క్రీడా కార్యకలాపాలను ఆస్వాదించవచ్చు.
తాజా వార్తలు
- కువైట్లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!
- ప్రాంతీయ భద్రత అంశంలో భారత్కు బహ్రెయిన్ కృతజ్ఞతలు..!!
- మసీర్హా పోర్టులో అగ్నిప్రమాదం.. వేగంగా స్పందించిన ఫైర్ ఫైటర్స్..!!
- నకిలీ వస్తువుల కొనుగోలుపై యూఏఈ హెచ్చరిక..రూ.2.3 కోట్ల వరకు జరిమానా, జైలు శిక్ష..!!
- ఖతార్లో చక్కెర కలిపిన పానీయాలపై ఎక్సైజ్ పన్ను అమలు..!!
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..







