ఐఐటి విద్యార్థిని అంజలి చదువుకి మంత్రి కేటీఆర్ ఆర్థిక సహాయం
- August 25, 2021
హైదరాబాద్: వరంగల్ జిల్లా హసన్పర్తి కి చెందిన విద్యార్థిని మేకల అంజలి రెండు సంవత్సరాల క్రితం ఐఐటీలో సీటు దక్కించుకుంది. అయితే తన కుటుంబ పేదరికం,ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో తన చదువును కొనసాగించేందుకు ఆర్థిక సహాయం చేయాలని మంత్రి కేటిఆర్ ని కోరింది. మేకల అంజలి పేదరిక పరిస్థితులను తెలుసుకున్న మంత్రి కే.తారక రామారావు తన వ్యక్తిగత హోదాలో గత రెండు సంవత్సరాలుగా ప్రతి ఏడాది ఆమె ఫీజులకు అవసరమైన నిధులను అందిస్తూ వస్తున్నారు.ఇచ్చిన హామీ మేరకు ఈ ఏడాది మరియు రానున్న సంవత్సరానికి సంబంధించిన ఐఐటి ఫీజుల మొత్తాన్ని ఈరోజు మంత్రి కే. తారకరామారావు అంజలి కుటుంబానికి అందించారు.ఈ సందర్భంగా అంజలి చదువు మరియు భవిష్యత్ ప్రణాళికల గురించి వివరాలు అడిగి తెలుసుకున్న మంత్రి కేటీఆర్, ఆమె తన చదువు దిగ్విజయంగా పూర్తి చేసుకొని జీవితంలో మరిన్ని ఉన్నత శిఖరాలు చేరుకోవాలని ఆకాంక్షించారు.మంత్రి కేటీఆర్ తమ కూతురు ఐఐటి విద్యకు సంబంధించిన పూర్తి ఆర్థిక సహాయాన్ని అందించడం పట్ల అంజలి కుటుంబం ధన్యవాదాలు తెలిపింది.
తాజా వార్తలు
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!







