ముఖ్యమంత్రి స్టాలిన్ ను అభినందించిన జనసేన అధ్యక్షుడు
- September 01, 2021
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ను సినీ నటుడు , జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభినందించారు. ముఖ్యమంత్రిగా పదవి చేపట్టినప్పటి నుండి తన నిర్ణయాలతో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆదర్శం అవుతూ వస్తున్నారు స్టాలిన్. రీసెంట్గా అసెంబ్లీలో ఎవరికైనా పొగిడే ఉద్దేశం ఉంటే మానుకోవాలని, అలాంటి ఎమ్మెల్యేల విషయంలో కఠినంగా వ్యవహరిస్తానని చెప్పడం..అలాగే రాష్ట్రంలో విద్యార్థులకు ఉచితంగా ఇవ్వాల్సిన 65లక్షల స్కూల్ బ్యాగ్ లపై మాజీ ముఖ్యమంత్రులు జయలలిత,ఎడప్పాడి పళనిస్వామి ఫోటోలు అలాగే కొనసాగించాలని చెప్పారు. మళ్లీ కొత్త బ్యాగుల వల్ల ప్రభుత్వ ఖజానా కు నష్టమే తప్ప లాభం లేదని..ఇలా ఆ బ్యాగులే ఇవ్వడం వల్ల రాష్ట్ర ఖజానాకు రూ.13కోట్లు ఆదా అవుతాయని స్టాలిన్ నిర్ణయించారు. ఈ నిర్ణయాల ఫై సోషల్ మీడియా లో అందరు ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఈ తరుణంలో పవన్ కళ్యాణ్ సైతం జనసేన ట్విట్టర్లో స్టాలిన్ కు శుభాకాంక్షలు తెలుపుతూ నోట్ విడుదల చేయడం వైరల్ గా మారింది. ఏ పార్టీ అయినా ప్రభుత్వంలోకి రావటానికి రాజకీయం చెయ్యాలి కానీ – ప్రభుత్వంలోకి వచ్చాక రాజకీయం చెయ్యకూడదు. దీన్ని మీరు మాటల్లో కాకుండా చేతల్లో చేసి చూపిస్తున్నారు. మీ పరిపాలన, మీ ప్రభుత్వ పని తీరు మీ ఒక్క రాష్ట్రానికే కాదు దేశంలోని అన్ని రాష్ట్రాలకు, అన్ని రాజకీయ పార్టీలకు మార్గదర్శకం… స్ఫూర్తిదాయకం. మీకు మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియచేస్తున్నాను. మీకు నా శుభాకాంక్షలు.
పవన్ కళ్యాణ్, అధ్యక్షులు- జనసేన” అంటూ ట్వీట్ చేశారు పవన్.
To Hon. CM @mkstalin garu, pic.twitter.com/iIo0YMD1vT
— Pawan Kalyan (@PawanKalyan) August 31, 2021
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







