హైదరాబాద్ ఎయిర్ కార్గోలో జర్మనీకి చెందిన డోకాష్ ‘ఆప్టికూలర్’ కంటెయినర్ స్టేషన్
- September 01, 2021
హైదరాబాద్: హైదరాబాద్ ఎయిర్ కార్గో,నేడు ఆప్టికూలర్ టెంపరేచర్ కంట్రోల్డ్ ఎయిర్ కార్గో కంటైనర్ల కోసం ఒక ప్రత్యేక సర్వీస్ స్టేషన్‌ను ప్రారంభించడానికి జర్మనీకి చెందిన డోకాష్ టెంపరేచర్ సొల్యూషన్స్‌తో ఒక నూతన కొత్త భాగస్వామ్యాన్ని ప్రకటించింది.డోకాష్ టెంపరేచర్ సొల్యూషన్ యొక్క గ్లోబల్ సర్వీస్ స్టేషన్ నెట్‌వర్క్‌లో ఇది మొదటి మరియు ఏకైక భారతీయ కేంద్రం.
'ఫార్మా జోన్' పేరిట ఫార్మా ఎక్స్పోర్ట్ టెర్మినల్‌తో, GHAC దక్షిణ మధ్య భారతదేశంలో ఫార్మా ఎగుమతులకు ప్రసిద్ధి చెందింది. ప్రాణాలను కాపాడే ఔషధాలను ప్రపంచవ్యాప్తంగా రవాణా చేయడం కోసం స్థానిక ఔషధ తయారీదారులు, ఫార్వార్డర్లు, ఎయిర్‌లైన్స్‌కు హైదరాబాద్ నెట్వర్క్ స్టేషన్లో కంటైనర్లు సులభంగా అందుబాటులో ఉంటాయి. కోవిడ్ కు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో వ్యాక్సిన్ల హైదరాబాద్ ఆధారిత వ్యాక్సిన్ తయారీదారులు కీలక పాత్ర పోషిస్తారని భావిస్తున్నందున కొత్త స్టేషన్ ప్రారంభించే సమయం కూడా సరైనది.
ప్రదీప్ పణికర్, CEO-GMR హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం,"హైదరాబాద్ ఎయిర్ కార్గో టెర్మినల్ దక్షిణాసియా ప్రాంతంలోని ఫార్మాస్యూటికల్స్,వ్యాక్సిన్లకు ప్రధానమైన గేట్‌వే. మా కార్గో టెర్మినల్‌లో ఒక సర్వీస్ స్టేషన్ ఏర్పాటు చేయడానికి డోకాష్ టెంపరేచర్ సొల్యూషన్స్‌తో భాగస్వామ్యం ఏర్పరచుకోవడం మాకు చాలా సంతోషకరం.కొత్త ఫెసిలిటీ వల్ల ప్రపంచ స్థాయి డోకాష్ ఆప్టికూలర్ కంటైనర్లను మా వినియోగదారులకు తక్షణం, సులభంగా అందుబాటులో ఉండేలా చేస్తుంది.ఈ ఫెసిలిటీతో GMR హైదరాబాద్ ఎయిర్ కార్గో ఈ ప్రాంతంలో టెంపరేచర్ కంట్రోల్డ్ ఎయిర్ కార్గో కంటైనర్లకు అతిపెద్ద కేంద్రంగా ఉంటుంది.’’ అన్నారు.
డోకాష్ టెంపరేచర్ సొల్యూషన్స్ మేనేజింగ్ డైరెక్టర్ మిస్టర్ ఆండ్రియాస్ సీట్జ్, " ఫార్మాస్యూటికల్స్, బయోసిమిలర్లు,బయోటెక్‌లకు భారతదేశం, ప్రత్యేకించి హైదరాబాద్ అత్యంత కీలకం. అందుకే మా విస్తృత నెట్‌వర్క్‌కు అదనంగా కూల్ చైన్‌కి దోహదం చేయడానికి మేము మా కొత్త సర్వీస్ స్టేషన్‌ను ప్రారంభించాలని నిర్ణయించుకున్నాము.ఈ స్టేషన్ ప్రపంచవ్యాప్తంగా సంబంధిత పరిశ్రమ కేంద్రంగా ఉండటమే కాకుండా, విమానాశ్రయాన్ని మా భాగస్వామి విమానయాన సంస్థలు కూడా ఉపయోగించడమే కాకుండా, ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న గమ్యస్థానాలకు బాగా కనెక్ట్ చేయబడింది. ఈ కోవిడ్ సమయంలో వ్యాక్సిన్లు వంటి ప్రాణాలను కాపాడే ఔషధ ఉత్పత్తుల ప్రపంచ సరఫరా కోసం మా కొత్త స్టేషన్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని భావిస్తున్నాం.’’ అన్నారు.
డోకాష్ తరపున GHAC ద్వారా నిర్వహించబడుతున్న కొత్త సర్వీస్ స్టేషన్ ఒకేసారి 100 ప్రత్యేక, టెంపరేచర్ కంట్రోల్డ్ కంటైనర్లను నిలువ చేయగలగడమే కాకుండా డోకాష్ కస్టమర్లకు ప్రైమరీ రీజనల్ హబ్ గా పని చేస్తుంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్‌తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్‌కు పంపొద్దు..!!
- కువైట్‌లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్‌లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ







