ఎస్బీఐలో ఉద్యోగావకాశాలు...
- September 02, 2021
ప్రభుత్వ ఉద్యోగాలకోసం ఎదురుచూసే నిరుద్యోగులకు చివరి అవకాశం.SBI SO రిక్రూట్మెంట్ దరఖాస్తు విండో ఈ రోజు మూసివేస్తారు.స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వివిధ విభాగాలలో స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టుల కోసం నియామకాలు జరుపుతోంది.ఈ పోస్టుల కోసం ఆన్లైన్లో అప్లై చేయాలి. నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 69 పోస్టులు భర్తీ చేస్తారు. దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు SBI అధికారిక వెబ్సైట్ sbi.co.in ని సందర్శించి దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్ ప్రకారం దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు 13 నుంచి ప్రారంభమైంది.ఇందులో దరఖాస్తు చేసుకోవడానికి ఈ రోజే చివరితేది. అభ్యర్థులకు రాత్రి వరకు సమయం ఉంది.దరఖాస్తు తేదీ ముగిసిన తర్వాత అధికారిక వెబ్సైట్ http://sbi.co.in నుంచి దరఖాస్తు ఫారం లింక్ తీసివేస్తారు. దరఖాస్తు చేయడానికి ముందు దయచేసి వెబ్సైట్లో ఉన్న అధికారిక నోటిఫికేషన్ని ఒక్కసారి పరిశీలించండి. డిప్యూటీ మేనేజర్ – 10 పోస్టులు, రిలేషన్ షిప్ – 06 పోస్టులు, ప్రొడక్ట్ మేనేజర్- 02 పోస్టులు, అసిస్టెంట్ మేనేజర్ – 50 పోస్టులు, సర్కిల్ డిఫెన్స్ బ్యాంకింగ్ సలహాదారు – 01 పోస్ట్ భర్తీ చేస్తారు.
ఇలా అప్లై చేయండి..
1. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ముందుగా అధికారిక వెబ్సైట్- sbi.co.in కి వెళ్లండి.
2. వెబ్సైట్ హోమ్ పేజీలో ప్రస్తుత ఖాళీపై క్లిక్ చేయండి.
3. ఇప్పుడు SBI SCO రిక్రూట్మెంట్ 2021 లింక్‌కి వెళ్లండి.
4. ఇక్కడ అడిగిన వివరాలను నమోదు చేయండి.
5. రిజిస్ట్రేషన్ తర్వాత అప్లికేషన్ ఫారం నింపండి.
6. దరఖాస్తు ప్రక్రియ పూర్తయిన తర్వాత, ప్రింట్ అవుట్ తీసుకోండి.
తాజా వార్తలు
- యూఏఈ–ఫ్రాన్స్ సంబంధాల బలోపేతంపై షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్, ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ చర్చలు
- హూతీల భీకర దాడి.. 53 మంది యెమెన్ సైనికులు మృతి
- నాలుగవ ప్రపంచ తెలుగు మహాసభలు (బాలల) నిర్వహణ తేదీల మార్పు
- భారత్–న్యూజిలాండ్ మధ్య రేపటి నుంచే FTA అమలు
- ఫ్లైదుబాయ్ విమాన ఘటన పై స్పందించిన భారత పైలట్ స్మిత్ మచ్చర్
- దుబాయ్‌లో ఘనంగా ఐపీఎఫ్ తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ బతుకమ్మ సంబరాలు
- ఫ్యూచర్‌సిటీకి కొత్త పోలీస్ కమిషనరేట్.. ప్రారంభించిన సీఎం రేవంత్
- మలేషియాలో ఘనంగా MYTA 13వ గ్రాండ్ బతుకమ్మ వేడుకలు
- దుబాయ్‌లో నకిలీ అనారోగ్య సెలవు ధ్రువపత్రాల జారీ.. క్లినిక్ క్లర్క్‌కు జైలు శిక్ష
- నో పార్కింగ్ ప్రాంతాల్లో వాహనాలు నిలిపితే వీల్ క్లాంప్లు..!!







