ఆపిల్ కిచిడీ
- March 16, 2016
కావలసినవి: ఆపిల్స్ - 2, బాస్మతి బియ్యం ఒక కప్పు, మిర్చి - 1, పెద్ద ఉల్లిపాయ-1, జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్, ద్రాక్ష, చెర్రీస్ - తగినన్ని, దాల్చిన చెక్క - చిన్న ముక్క, లవంగాలు - 4, యాలక్కాయ - 1, నెయ్యి - 4 స్పూన్లు, ఉప్పు- తగినంత.
తయారీ: బియ్యాన్ని పలుకుగా ఉడికించి వడేసి పెట్టుకోవాలి. తరువాత యాపిల్ని చిన్న ముక్కలుగా కోసుకోవాలి. ఉల్లిపాయని సన్న ముక్కలుగా కోసుకోవాలి. మిర్చిని పొడవుగా కోయాలి. బాండీని వేడి చేసి దాంట్లో నెయ్యి వేసి, జీడిపప, బాదం, కిస్మిస్, దాల్చినచెక్క, లవంగాలు, యాలక్కాయ, ఉల్లిపాయ, మిరపకాయలు వేసి వేగించి పక్కన పెట్టుకోవాలి. ఇదే బాండీలో ఉడికించి వడకట్టిన బియ్యాన్ని వేసి అందులో కొంచెం ఉప్పు వేసి కలపాలి. దీనిపైన ముందుగా వేగించి పెట్టుకున్న మసాలా కాస్త వేసి, ఆ పైన మళ్ళీ అన్నం వేసి, పైన మళ్ళీ మసాల వేసి మూతపెట్టాలి. సన్నగా తరిగిన యాపిల్ ముక్కలు వేసి పది నిమిషాలు వేడి మీద ఉంచి దించివేయాలి. వడ్డించేటప్పుడు పైన చెర్రీస్, ద్రాక్ష, కిస్మిస్ వేసి పొడవుగా కోసుకున్న యాపిల్ ముక్కల్ని ప్లేట్ చుట్టూరా పెడితే అందంగా ఉంటుంది.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







