తెలంగాణ: భారీ వర్షాల నేపథ్యంలో పోలీసుశాఖ హెచ్చరికలు
- September 27, 2021
హైదరాబాద్: గులాబ్ తుఫాన్ నేపథ్యంలో భారీ వర్షాల దృష్ట్యా రాష్ట్ర ప్రజలకు పోలీసుశాఖ పౌరులకు కీలక హెచ్చరిక జారీ చేసింది. అత్యవసరమయితే తప్ప బయటకి రావొద్దని సూచించింది. లోతట్టు ప్రాంతవాసులు అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది. నీటి ప్రవాహాలు దాటేందుకు ప్రయత్నించవద్దని హెచ్చిరించింది. ఎవరైనా ఆపదలో ఉంటే డయల్ 100ను సంప్రదించాలని పేర్కొంది. ముఖ్యంగా హైదరాబాద్ ప్రజలకు కీలక సూచనలు చేసింది. రాబోవు కొన్ని గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని కోరింది.
భారీ వర్షాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు అలెర్ట్ అయ్యారు. ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. హైదరాబాద్ అధికారులతో కలెక్టరేట్‌లో కంట్రూల్ రూమ్ ఏర్పాటు చేశారు. సాయం కోసం టోల్ ఫ్రీ నెంబర్ 040*23202813 కాల్ చేయాలన్నారు. అత్యవసరమైతే తప్ప బయటికి రావొద్దని హెచ్చరించారు.
గులాబ్ తుఫాను ప్రభావంతో హైదరాబాద్ తోపాటు మహబూబాబాద్, కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, సిద్దిపేట, ఖమ్మం, వరంగల్, హన్మకొండ, యాదాద్రి భువనగిరి, సంగారెడ్డి, మెదక్, నిర్మల్, నిజామాబాద్, నల్గొండ, రంగారెడ్డి, సూర్యాపేట, ఆదిలాబాద్, కుమురంభీం అసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. ప్రస్తుతం వరంగల్, హైదరాబాద్, కొత్తగూడెంలో ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు అందుబాటులో ఉన్నాయి. ప్రతి మండలంలో ప్రత్యేక అధికారులను నియమించి ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లకుండా చూడాలని జిల్లా కలెక్టర్లు.. అధికారులను ఆదేశించారు.
తాజా వార్తలు
- ఖతార్లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్







