25 భాషల్లో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ వెబ్ సైట్..లాంచ్ చేసిన రామ్ చరణ్
- October 18, 2021
మెగాస్టార్ చిరంజీవి ఏర్పాటు చేసిన 'చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్' ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు జరుగు తున్న సంగతి తెలిసిందే. చిరంజీవి బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ ద్వారా ఎంతో మంది సేవలు పొందారు. కరోనా సమయంలో సైతం చిరు తన చారిటబుల్ ట్రస్ట్ ద్వారానే ఎంతోమందికి ఆక్సిజన్ కాన్సన్‌ట్రేషన్స్ పంపించారు. ఇప్పుడు అదే పేరు మీద చిరు ఓ వెబ్ సైట్ ను ప్రారంభించారు. మొత్తం 25 భాషల్లో ఈ వెబ్ సైట్ అందుబాటులో ఉంది. చిరంజీవి తనయుడు రామ్ చరణ్ ఈ వెబ్ సైట్ ను లాంఛ్ చేశారు. ఈ వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ సేవలు సైతం అందుబాటులోకి వచ్చాయి.

మరిన్ని ప్రాంతాలకు ట్రస్ట్ సేవల్ని విస్తరించాలనే ఉద్దేశంతోనే ఈ వెబ్ సైట్ ను ప్రారంభించినట్టు రామ్ చరణ్ తెలిపారు. చిరు చిత్రసీమలోకి అడుగుపెట్టి.. స్టార్ గా ఎదిగే క్రమంలో ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి అందరికీ తెలిసేలా ఈ వెబ్ సైట్ ను ప్రారంభించినట్టు తెలుస్తోంది. kchiranjeevi.com పేరుతో ప్రస్తుతం ఈ వెబ్ సైట్ అందుబాటులో ఉంది. చిరంజీవి నటించిన 150 సినిమాల సమాచారం, పాటలు, దర్శక నిర్మాతలతో ఆయనకున్న రిలేషన్ గురించి సమాచారం ఇందులో లభ్యమవుతుంది.
తాజా వార్తలు
- డ్రోన్ల అమ్మకం, పంపిణీ పై కువైట్ నిషేధం..!!
- మోసపూరిత బీమా కంపెనీలపై దుబాయ్ పోలీసుల హెచ్చరిక..!!
- సహమ్లో ఇద్దరిని రక్షించిన రెస్క్యూ టీమ్స్..!!
- అమరావతి మీదుగా హైదరాబాద్-చెన్నై బుల్లెట్ ట్రైన్
- ప్రముఖ ఆలయాల పరిసరాల్లో తిరుమల తరహా నిబంధనలు: సీఎం రేవంత్
- అడ్రస్ ప్రూఫ్ లేకున్నా గ్యాస్ సిలిండర్..కేంద్రం కొత్త రూల్స్
- అమరావతి నిర్మాణ పనులపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ఖతార్ పర్యటనకు ఇటలీ ప్రధాన మంత్రి..!!
- కువైట్ లోని పోర్ట్ కార్యకలాపాలపై అత్యవసర సమావేశం..!!
- బహ్రెయిన్ అధ్యక్షతన కైరో చర్చలు..!!









