ఆ వైరస్‌కు ఇమ్యునిటీని తప్పించుకునే శక్తి ఉందా?..ఆందోళనలో సైంటిస్టులు
- October 19, 2021
వాషింగ్టన్: ప్రపంచవ్యాప్తంగా డెల్టా వేరియంట్ కరోనా వైరస్ హడలెత్తించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా డెల్టా ప్లస్ వేరియంట్ కూడా దూసుకువెళ్తోంది. డెల్టా వైరస్ మ్యుటేషన్ చెందుతున్న తీరుపై అమెరికాకు చెందిన ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ మాజీ కమీషనర్ స్కాట్ గాట్లిబ్ ఆందోళన వ్యక్తం చేశారు. డెల్టా వేరియంట్ మ్యుటేషన్ వల్ల ఏర్పడిన డెల్టా ప్లస్ వేరియంట్‌పై తక్షణమే దర్యాప్తు చేపట్టాలన్నారు. డెల్టా ప్లస్ వేగంగా విస్తరిస్తుందా లేదా అన్న అంశాన్ని తేల్చేందుకు అర్జెంట్‌గా పరిశోధన చేపట్టాలని ఆయన కోరారు. డెల్టా ప్లస్ వేరియంట్ వైరస్‌కు ఇమ్యునిటీని తప్పించుకునే శక్తి ఉందన్న అనుమానాలను ఆయన వ్యక్తం చేశారు. డెల్టా ప్లస్‌తో పాటు ఇతర కొత్త వేరియంట్ల ప్రవర్తన తీరుపై అధ్యయనం చేయాలన్నారు. ఆదివారం బ్రిటన్‌లో మళ్లీ కరోనా కేసుల సంఖ్య పెరిగిన నేపథ్యంలో డెల్టా ప్లస్ వ్యాప్తి గురించి స్టడీ చేయాలని గాట్లిబ్ అభిప్రాయపడ్డారు. డెల్టా ప్లస్ స్ట్రెయిన్‌లో K417N మ్యుటేషన్ ఉందని, ఇదే స్ట్రెయిన్ బీటా వెరియంట్‌లో కనిపిస్తోందని, దాని వల్ల రీఇన్‌ఫెక్షన్ రిస్క్ ఎక్కువగా ఉన్నట్లు అర్థమవుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- తానా ప్రపంచసాహిత్యవేదిక 95వ సమావేశం విజయవంతం
- ఎయిర్ ఇండియా ఫుకెట్ విమాన పైలట్‌కు మత్తు పదార్థం పరీక్షలో పాజిటివ్
- ఇంటికి అడ్డుగా పార్కింగ్ చేస్తే QAR 300 జరిమానా..!!
- యూఏఈలోలో దాదాపు 20 విమానాలు ఆలస్యం, రద్దు..!!
- నిర్మాణ దుమ్ముపై రియాద్ కఠిన చర్యలు.. SR20 మిలియన్ జరిమానాలు..!!
- అబుదాబి ఇంటర్నేషనల్ చెస్ ఫెస్టివల్లో భారత విద్యార్థి సత్తా..!!
- దుక్మ్ పోర్టుకు వచ్చిన ప్రపంచంలోని అతిపెద్ద కార్ క్యారియర్..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్లకు 8 నెలల్లో 3.94 లక్షల విజిట్స్..!!
- సౌదీలో Absherలో 4 కొత్త ఆన్లైన్ సేవలు.. పౌరులు, నివాసితులకు మరింత సులభతరం
- బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్‌లో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం







