డ్రైవింగ్ అనుమతులు లేకుండా పట్టుబడిన ఆరుగురు విదేశీయులను పంపివేత
- March 24, 2016
కువైట్ అనుమతులు లేకుండా డ్రైవింగ్ చేస్తున్న ఆరుగురు విదేశీయులు పట్టుబడటంతో వీరిని దేశం నుండి పంపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. వీరు చెల్లుబాటు లేని లైసెన్స్ లను ఉపయోగిస్తున్నట్లు రుజువైనందున వీరిపై చర్యలు తీసుకోనున్నారు. గత వారం ట్రాఫిక్ అధికారులు రోడ్డు ఉల్లంఘనలు మరియు భద్రత స్థాయిలను నిర్ధారించడానికి ప్రచారాన్ని నిర్వహించి పలు తనిఖీలను నిర్వహించారు. ఈ సమయంలో ఈ ఆరుగురు విదేశీయులు పట్టుబడ్డారు. ఉత్తర అరేబియన్ గల్ఫ్ రాష్ట్ర ఆరు గవర్నరేట్ల లో ప్రచారం సందర్భంగా, 32.345 డ్రైవర్లు ట్రాఫిక్ చట్టాలు మరియు సంస్కరణలను అమలుచేయడంలో విఫలమయ్యారు. ఇందులో 56 డ్రైవర్లను ట్రాఫిక్ అధికారులు సూచన మేరకు పోలీసులకు అప్పగించాబడ్డారు. ఈ తనిఖీలో 1,322 కార్లు మరియు 14 మోటార్ సైకిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. సరైన అనుమతులు, ట్రాఫిక్ చట్టాలు మరియు సంస్కరణలను అమలుచేయని వారి కారణంగా ఇటీవల ఆరుగురు మరణించగా మొత్తం 1,644 ప్రమాదాలలో 244 మంది గాయపడ్డారు. ఈ సందర్భంగా కువైట్ ట్రాఫిక్ జనరల్ డైరెక్టరేట్ , ప్రజా సంబంధాల విభాగం అధికారి రోజూ ఆల్ రాయ్ మాట్లాడుతూ "మేము రోడ్డు మీద డ్రైవింగ్ నియమాలు పాటించాలో వివరిస్తాం అలాగే రహదారులపై ప్రయాణికుల క్షేమం మాకు ముఖ్యం. మా తనిఖీ లో ఏమాత్రం కనికరం ఉండదని " చెప్పారు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







