పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రిలీజ్ చేసిన 'జయమ్మ పంచాయితీ' ట్రైలర్,
- April 16, 2022
హైదరాబాద్: పాపులర్ యాంకర్, టెలివిజన్ వ్యాఖ్యాత, హోస్ట్ సుమ కనకాల ప్రధాన పాత్రలో నటించిన 'జయమ్మ పంచాయితీ' విడుదలకు సిద్ధమైయింది. ప్రస్తుతం ప్రమోషన్స్ జోరుగా జరుపుకుంటున్న ఈ చిత్రం ట్రైలర్ ని విడుదల చేశారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేతుల మీదగా ఈ ట్రైలర్ గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.
2 నిమిషాల 15 సెకండ్ల నిడివి గల ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా ఆకట్టుకుంది. తనకు వచ్చిన సమస్య పై జయమ్మ పంచాయితీ పెట్టడం, గ్రామ పెద్దలు జయమ్మ సమస్యని తేలికగా తీసుకోవడం, జయమ్మ ఎదురు తిరగడం.. ఇలా కథ, సినిమా పై ఆసక్తిని పెంచేలా ట్రైలర్ వుంది. ఉత్తరాంధ్ర మాండలికంలో సాగిన సంభాషణలు ఆసక్తికరంగా వున్నాయి. 'ఎవరు వల్ల సెడ్డావురా వీరన్న అంటే నోటి వల్ల సెడ్డానురా కాటమరాజా' అని జయమ్మ పలికిన డైలాగ్ నవ్వులు పూయించింది. ట్రైలర్ లో వినిపించిన డైలాగ్స్ ని నటులంతా ఉత్తరాంధ్ర మాండలికంలో చక్కగా పలికారు.
జయమ్మపాత్రలో సుమ కనిపించిన తీరు అద్భుతంగా వుండటంతో పాటు సహజంగా, ప్రేక్షకులు చాలా సులువుగా ఆ పాత్రని కనెక్ట్ చేసుకునేలా వుంది. దర్శకుడు ఒక వైవిధ్యమైన కథని ఈ చిత్రంతో ప్రేక్షకులకు చూపించబోతున్నారనే విషయం ట్రైలర్ చూస్తే అర్ధమౌతుంది. ఎంఎం కీరవాణి అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంది.
వెన్నెల క్రియేషన్స్ పతాకంపై బలగ ప్రకాష్ నిర్మిస్తున్న 'జయమ్మ పంచాయితీ' మే 6న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలకు సిద్ధమైయింది.
తారాగణం: సుమ కనకాల
సాంకేతిక విభాగం :
కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: విజయ్ కుమార్ కలివరపు
సంగీతం: ఎంఎం కీరవాణి
డీవోపీ: అనూష్ కుమార్
ఎడిటర్: రవితేజ గిరిజాల
నిర్మాత: బలగ ప్రకాష్
సమర్పణ: శ్రీమతి విజయ లక్ష్మి
బ్యానర్: వెన్నెల క్రియేషన్స్
ఆర్ట్: ధను అంధ్లూరి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అమర్ - అఖిల
పబ్లిసిటీ డిజైన్స్: అనంత్ కంచెర్ల
కాస్ట్యూమ్స్: హరి ప్రియ
పీఆర్వో: వంశీ-శేఖర్
డిజిటల్ పీఆర్: మనోజ్ వల్లూరి
డిజిటల్ ప్రమోషన్స్: హాష్ ట్యాగ్ మీడియా
తాజా వార్తలు
- Dubai Sports Council launches Annual Sports Events Calendar
- నాలుగవ ప్రపంచ తెలుగు మహాసభలు (బాలల) నిర్వహణ తేదీల మార్పు
- భారత్–న్యూజిలాండ్ మధ్య రేపటి నుంచే FTA అమలు
- ఫ్లైదుబాయ్ విమాన ఘటన పై స్పందించిన భారత పైలట్ స్మిత్ మచ్చర్
- దుబాయ్‌లో ఘనంగా ఐపీఎఫ్ తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ బతుకమ్మ సంబరాలు
- ఫ్యూచర్‌సిటీకి కొత్త పోలీస్ కమిషనరేట్.. ప్రారంభించిన సీఎం రేవంత్
- మలేషియాలో ఘనంగా MYTA 13వ గ్రాండ్ బతుకమ్మ వేడుకలు
- దుబాయ్‌లో నకిలీ అనారోగ్య సెలవు ధ్రువపత్రాల జారీ.. క్లినిక్ క్లర్క్‌కు జైలు శిక్ష
- నో పార్కింగ్ ప్రాంతాల్లో వాహనాలు నిలిపితే వీల్ క్లాంప్లు..!!
- డిజిటల్, ఏఐ రంగాల్లో సహకారంపై బహ్రెయిన్, సౌదీ చర్చలు..!!







