జూన్ 15న బి-స్క్వేర్ మాల్ ప్రారంభం
- April 06, 2016
దోహా ప్రజలకోసం సరికొత్త షాపింగ్ అనుభూతి సిద్ధమవుతోంది. అల్ బండారీ ఇంటర్నేషనల్ గ్రూప్ (బిఐజి) బి-స్క్వేర్ మాల్ని జూన్ 15న ప్రారంభించనుంది. పేరొందిన బండారీ రియల్ ఎస్టేట్ గ్రూప్‌కి చెందిన బిఐజి నుంచి వస్తున్న బి-స్క్వేర్ మాల్, షాపింగ్ ప్రియులకు సరికొత్త అనుభూతిని ఇవ్వనుంది. షాపింగ్, డైనింగ్, ఎంటర్టైన్మెంట్ ఇంతకు ముందెన్నడూ లేని విధంగా బి-స్క్వేర్‌లో ఉంటాయని సంస్థ ప్రతినిథులు చెప్పారు. అల్ థుమామా ప్రాంతంలో ఎఫ్ రింగ్ రోడ్లో అల్ థుమ్మా పార్క్ వద్ద ఈ మాల్ ఏర్పాటవుతుంది. 25000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో బి-స్క్వేర్ మాల్ ఏర్పాటవుతుందని అల్ బండారీ రియల్ ఎస్టేట్ మాల్స్ మేనేజర్ అమ్జాద్ సలే అన్నారు. గ్రౌండ్ ఫ్లోర్లో 62, బేస్మెంట్లో 200 పార్కింగ్ స్పేసెస్ ఉన్నాయనీ, 39 కియోస్క్‌లు, 35 రిటైల్ స్టోర్స్, సూపర్ మార్కెట్, డిపార్ట్మెంట్ స్టోర్స్ ఉన్నాయని, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ 9 కిచెన్లతో ఫుడ్ కోర్ట్, 4 థియేటర్లతో అద్భుతమైన సినీ అనుభూతి ప్రజలకు తమ మాల్ అందివ్వనుందని ఆయన తెలిపారు. స్పార్ సూపర్ మార్కెట్, రాక్సీ సినిమా, జావా యు కేఫ్, అల్ అకెర్ స్వీట్స్, గల్ఫ్ ఫార్మసీ, వెలాసిటీ సిటీ తదితర రిటైలర్స్ బి-స్క్వేర్ మాల్లో కొలువుదీరుతున్నాయి.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







