ప్రబాస్ సినిమాలో కృష్ణంరాజు వుండాల్సిందేనా.?
- June 06, 2022
అన్ని సినిమాలూ అనలేం కానీ, ప్రబాస్ నటించిన కొన్ని సినిమాల్లో కృష్ణం రాజు పాత్రను అవసరం లేకున్నా, బలవంతంగా ఇరికించేస్తుంటారు ఎందుకో. ఆ బలవంతపు పైత్యం ప్రేక్షకుల్ని చాలా సార్లు ఇరిటేషన్‌కి గురి చేస్తుంటుంది. ప్రబాస్ తాజా సినిమా ‘రాధేశ్యామ్’లోనూ కృష్ణంరాజు పాత్ర అలాగే వుంటుంది.
అయితే, కృష్ణంరాజు నటించిన ప్రబాస్ సినిమాలు ఖచ్చితంగా ఫ్లాప్ అవుతాయ్.. అనే ప్రచారం కూడా వుంది. అందులో భాగంగానే, గతంలో ప్రబాస్ నటించిన ‘బిల్లా’, ఇప్పుడు ‘రాధేశ్యామ్’ తదితర సినిమాలు ఫెయిలయ్యాయని అంటుంటారు.
‘రాధేశ్యామ్’ సినిమా హిందీ వెర్షన్లో కృష్ణం రాజు పోషించిన పాత్రను సత్యరాజ్ పోషించాడు. ఆయన నటించడం వల్ల ఆ పాత్రకు అందం వచ్చిందన్న టాక్‌తో పాటు తెలుగులో ఆ పాత్ర చాలా ఇరిటేట్ చేసిందన్న విస్మయం ఒకటి ప్రేక్షకుల్లో వుంది.
సరే, ఇప్పుడీ చర్చ ఎందుకంటే, ప్రబాస్ తదుపరి చిత్రం ‘ఆది పురుష్’ లోనూ కృష్ణంరాజు ఓ ఇంపార్టెంట్ రోల్లో కనిపించబోతున్నారట. అంటే అది కూడా ప్రబాస్‌కి ఫెయిల్యూర్ లిస్టులో చేరిపోతుందన్న మాటే.. అని కొందరు ఆడియన్స్ భావిస్తున్నారు. అసలే సినీ పరిశ్రమలో సెంటిమెంట్లకు కీలక స్థానం వుంది.
అలాంటప్పుడు ప్రబాస్ ఎందుకు రిస్క్ చేస్తున్నాడు.? అంటూ ఆయన అభిమానులే గగ్గోలు పెడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా ఈ ఇష్యూ పెద్ద చర్చకు దారి తీసింది. కానీ, ప్రబాస్ సినిమాలో కృష్ణంరాజు పాత్ర ఖచ్చితంగా వుండాల్సిందే అనే ఒత్తిడి ఎటు వైపు నుంచి వస్తుందో తెలీదు కానీ, పాపం ప్రబాస్ అనవసరంగా అన్యాయం అయిపోతున్నాడుగా.!
తాజా వార్తలు
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్







