నారా రోహిత్ తర్వాత మూవీ జ్యో అచ్యుతానంద..
- April 08, 2016
నారా వారి అబ్బాయి ఈ ఏడాది మంచి జోరుమీదున్నాడు. ఈ ఒక్క సంవత్సరంలోనే దాదాపు పది సినిమాలను రిలీజ్ చేసే ప్లాన్‌లో ఉన్నారు. ఇప్పటికే తుంటరి, సావిత్రి సినిమాలను రిలీజ్ చేసిన నారా రోహిత్ తన తాజా చిత్రం రాజా చెయ్యి వేస్తేని రిలీజ్‌కు రెడీ చేస్తున్నారు. ఇక తాజాగా నారా రోహిత్, నాగశౌర్య కాంబినేషన్‌లో వస్తున్న మూవీని సెట్స్ పైకి తీసుకెళ్ళారు. రొమాంటిక్ కామెడీ మూవీగా తెరకెక్కుతున్న ఈ మల్టీ స్టారర్ మూవీ జ్యో, అచ్యుత్, ఆనంద్ అనే మూడు పాత్రల చుట్టూ తిరగన్నునట్టు టాక్.ఒకప్పుడు కమెడీయన్‌గా అలరించిన అవసరాల శ్రీనివాస్ ఊహలు గుసగుసలాడే చిత్రంతో డైరెక్టర్‌గా టర్న్ అయ్యారు. తొలి చిత్రంతోనే మంచి సక్సెస్ సాధించిన అవసరాల ఆ తర్వాత మరే సినిమాకు కమిట్ కాలేదు. ప్రస్తుతం జ్యో అచ్యుతానంద అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ వారాహి చలన చిత్రం నిర్మిస్తోంది. నాగ శౌర్య, నారా రోహిత్ అన్నదమ్ములుగా కనిపించనున్నారు. ఇక రెజీనా ఈ చిత్రంలో హీరోయిన్‌గా కనిపించనుంది. నారా రోహిత్ పూరీతో కూడా ఓ చిత్రం చేసేందుకు సిద్దమయ్యాడన్న సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







