హమ్మ. రష్మికా.! స్కెచ్ మామూలుగా లేదుగా.!

- July 19, 2022 , by Maagulf
హమ్మ. రష్మికా.! స్కెచ్ మామూలుగా లేదుగా.!

పబ్లిసిటీ విషయంలో రష్మిక రూటే సెపరేటు. అమ్మడికి ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా ఎక్కువన్న సంగతి తెలిసిందే. ఫ్యాన్స్‌తో సోషల్ మీడియా వేదికగా ఎప్పుడూ టచ్‌లో వుంటుంది రష్మిక.
అంతేకాదు, ఫ్యాన్స్‌ని ఏకవచనంలో సంబోధిస్తూ, చాలా క్లోజ్‌గా మూవ్ అవుతుంటుంది. అందుకే రష్మిక అంటే ఫ్యాన్స్‌కి అంత క్రేజ్ మరి. టాలీవుడ్‌కి ఎంటర్ కాకముందే, రష్మిక మాట టాలీవుడ్‌లో మార్మోగిపోయిందంటేనే ఆమె క్రేజ్ ఎలాంటిదో అర్ధం చేసుకోవాలి.

‘ఛలో’ సినిమాతో రష్మిక ఎంట్రీ ఇచ్చింది కానీ, అంతకు ముందే ఎన్టీయార్ సినిమాతో రాబోతోందట.. అల్లు అర్జున్ సినిమాలో రష్మిక అట.. అంటూ కన్నడలో సినిమాలు చేసినప్పుడే ఓ రేంజ్ క్రేజ్ దక్కించుకున్న ముద్దుగుమ్మ రష్మికా మండన్నా.

ఇక టాలీవుడ్‌కి వచ్చాకా, ఏమైనా తక్కువ చేసిందా.? కోలీవుడ్‌ని చక్కబెట్టేసింది డెబ్యూ చేయకుండానే. విజయ్‌తో రష్మిక సినిమా అంటూ టామ్ టామ్ అని ప్రచారం చేయించుకుంది. అప్పుడు ప్రచారమే అయినా, అదిప్పుడు నిజమైపోయిందనుకోండి.

తాజాగా విక్రమ్ సినిమాలో రష్మిక అట.. అంటూ ప్రచారం జరుగుతోంది. ఇంకేముంది,ఈ కాంబినేషన్ అధికారికంగా సెట్ అయిపోయిందంటూ డిక్లరేషన్లు కూడా వచ్చేసినంత పనయ్యింది. ఆ తర్వాత ఇది ఫేక్ న్యూస్ అని కొట్టిపాడేశారనుకోండి. అలా మొదట్నుంచీ గాసిప్స్ క్రియేట్ చేసుకోవడం.. ఆ గాసిప్స్‌నే నిజం చేసుకోవడంలో రష్మిక మహా ముదురు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com