మారుతి ఆత్మ- ప్రేతాత్మ.! ప్రబాస్ కొంప ముంచేయనున్నాడా.?
- October 27, 2022
ప్యాన్ ఇండియా సినిమాలు చేసి బోర్ కొట్టేసినట్లుంది ప్రబాస్‌కి. దాంతో ఫామ్‌లో లేని చిన్న డైరెక్టర్ మారుతితో సినిమాకి ఓకే చేసేశాడు. మారుతితో సినిమా అంటే, ఏముంటాయ్ అన్నీ మూస కథలే.
హీరోకి ఏదో ఒక లోపం పెట్టేసి, తద్వారా ఫన్ జనరేట్ చేయడమే మారుతి ఫార్ములా. లక్కు కలిసొచ్చింది. ఒకటీ, రెండు వర్కవుట్ అయ్యాయ్. ఆ తర్వాత నుంచి ఫెయిల్యూర్సే. అలాంటి మారుతితో ప్రబాస్ సినిమా చేయడం అంటే, ఇంతవరకూ సంపాదించుకున్న తన ఇమేజ్‌ని డ్యామేజ్ చేసుకోవడమే అంటూ మొదట్నుంచీ ఫ్యాన్స్ గగ్గోలు పెడుతూనే వున్నారు.
కానీ, ఫ్యాన్స్ మాట పెడచెవిని పెట్టేసి, ప్రబాస్, మారుతికి ఓకే చెప్పేశాడు. అంతేకాదు, సైలెంట్‌గా ఈ ప్రాజెక్టుని పూర్తి చేసేస్తున్నాడంటూ ఇన్‌సైడ్ టాక్ కూడా. తాజాగా ఈ సినిమాకి సంబంధించి మరో అప్‌డేట్ హల్‌చల్ చేస్తోంది. అదే ఈ సినిమా కథ. ఆత్మ కాన్సెప్టులో ఈ సినిమా వుంటుందని అంటున్నారు.
ప్రబాస్‌ని ఆవహించిన ఆత్మ ఏం చేసింది.? అలా ఆత్మ ఆవహించిన ప్రబాస్‌తో ఫన్ జనరేట్ చేయించడమే మారుతి టార్గెట్.. అంటూ ప్రచారం జరుగుతోంది. కొంప తీసి లారెన్స్ ‘ముని’ సినిమానో, లేక, సుధీర్ బాబు ‘ప్రేమ కథా చిత్రమ్’ సినిమానో మారుతి, ప్రబాస్‌తో మళ్లీ తీసేస్తాడా ఏంటీ.? అంటూ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. చూడాలి మరి, మారుతి ఏం చేస్తాడో.!
తాజా వార్తలు
- BD30కే అద్దె కారు.. ప్రమాదంతో BD6,204 జరిమానా..!
- నిత్యావసర వస్తువులు, ఇంధన సరఫరాకు కువైట్ కీలక చర్యలు..!!
- అబుదాబిలో ఘోర రోడ్డు ప్రమాదం.. తల్లి, 15 ఏళ్ల కుమారుడు మృతి..!!
- దుబాయ్‌లో GTF ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.
- ఖతార్‌లో అన్ని రంగాల్లో మహిళా సాధికారతకు ప్రోత్సాహం..!!
- ఒమన్‌లో రాళ్లను ఢీకొని నిలిచిపోయిన పడవ..!!
- సౌదీలో ‘సిక్స్ కింగ్స్ స్లామ్’ వాయిదా.. కొత్త తేదీలు ఇవే..!
- ఇరాన్ పై అతి పెద్ద బాంబు దాడికి అమెరికా ప్లాన్
- షార్జా పోలీసుల భారీ ఆపరేషన్.. సైబర్ నేరాలకు పాల్పడిన నాలుగు ముఠాల గుట్టురట్టు!
- ‘సౌదీ పై దాడులు వెంటనే ఆపాలి’ అంటూ హౌతీలకు భారత్ తీవ్ర హెచ్చరిక







