‘#NC22’.. చైతూ ఆవేశాన్ని ఆపే శక్తి ఏదీ లేదా.?
- November 22, 2022
అక్కినేని హీరో నాగ చైతన్య కొత్త సినిమా కోసం తమిళ విలక్షణ దర్శకుడు వెంకట్ ప్రభుతో కలిసి పని చేస్తున్న సంగతి తెలిసిందే. స్టార్ కాస్టింగ్‌తో పాటూ, స్టార్ టెక్నీషియన్లు ఈ సినిమా కోసం పని చేస్తున్నారు.
బేబమ్మ కృతి శెట్టి ఈ సినిమాలో చైతూకి జోడీగా నటిస్తోంది. హ్యాండ్సమ్ హీరో అరవింద్ స్వామి విలన్‌గా నటిస్తున్నాడు. కాగా, ఈ సినిమాకి సంబంధించి లేటెస్టుగా ఓ అప్‌డేట్ రిలీజ్ చేశారు మేకర్లు.
‘అతని ఆవేశాన్నీ ఏ శక్తీ ఆపలేదు..’ అనే క్యాప్షన్‌తో కూడిన ప్రీ లుక్ రిలీజ్ చేసి, చైతూ రోల్‌ని రిలీజ్ చేశారు. ‘శివ’ అనే పోలీసాఫీసర్ పాత్రలో చైతూ నటిస్తున్నాడు. చైతూ యొక్క శక్తిని పరిచయం చేసేలా వుంది ఈ ప్రీ లుక్ పోస్టర్. రేపు అనగా, నవంబర్ 23న చైతూ పుట్టినరోజు కావడంతో, ఈ సినిమాకి సంబంధించి టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసి, చైతూకి స్పెషల్ బర్త్‌డే విషెస్ తెలపనుంది చిత్ర యూనిట్.
కాగా, ఈ సినిమాని తెలుగు, తమిళ భాషల్లో రూపొందిస్తున్నారు. బైలింగ్వల్ మూవీగా రూపొందుతోన్న ఈ సినిమా నాగ చైతన్య కెరీర్ టర్నింగ్ మూవీ అవుతుందని అంచనా వేస్తున్నారు. చూడాలి మరి.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో 2026 మిస్క్ గ్లోబల్ ఫోరం రద్దు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో బీభత్సం..!!
- టీమ్ ఇండియాలో కొత్త ఆల్‌రౌండర్.. !
- కువైట్‌లో ర్యాష్ డ్రైవింగ్.. ప్రభుత్వ ఆస్తులకు నష్టం..!!
- ఒమన్, అర్మేనియా చర్చలు..పలు కీలక అంశాలపై సమీక్ష..!!
- బహ్రెయిన్ పౌరులకు విద్యుత్, నీటి బిల్లుల్లో ఊరట..!!
- అబుదాబి–రియాద్ విమాన సర్వీసులు రద్దు.. అక్టోబర్ 19 వరకు నిలిపివేత
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..







