యూఏఈ జాతీయ దినోత్సవ కవాతు: ట్రాఫిక్ ఆంక్షలు
- December 01, 2022
యూఏఈ: డిసెంబర్ 2న 51వ జాతీయ దినోత్సవం సందర్భంగా నిర్వహించే కవాతును పురస్కరించుకొని ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. డిసెంబర్ 1 ఉదయం 8 గంటల నుండి 11 గంటల వరకు కవాసిమ్ కార్నిచ్‌లో జాతీయ దినోత్సవ కవాతును నిర్వహించనున్నట్లు రస్ అల్ ఖైమా పోలీస్ జనరల్ కమాండ్ ప్రకటించింది. కవాసిమ్ కార్నిచ్కి వెళ్లే రహదారిని మూసివేయనున్నట్లు తెలిపింది. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను అనుసరించాలని రస్ అల్ ఖైమా పోలీసులు కోరారు.
ఎమిరేట్‌లోని అన్ని అంతర్గత, బాహ్య రహదారులపై జామ్‌లను తగ్గించడానికి సాఫీగా ట్రాఫిక్ ప్రవాహాన్ని సులభతరం చేయడానికి పోలీసులు పెట్రోలింగ్‌ను తీవ్రతరం చేయనున్నట్లు పేర్కొన్నారు. అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ సాధారణ, ట్రాఫిక్ నియంత్రణలకు కట్టుబడి ఉండాలని సూచింది. రోడ్లపై నిర్లక్ష్యంగా వాహనాలను నడపవద్దని, వాహనాల ప్లేట్ నంబర్లను తొలగించవద్దని, రోడ్లపై పాటించాలని, భద్రతా సూచనలను అనుసరించాలని ప్రజలను పోలీసులు కోరారు. యూఏఈ డిసెంబర్ 1 నుండి డిసెంబర్ 4 వరకు జాతీయ దినోత్సవాన్ని జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ప్రభుత్వ, ప్రైవేట్ రంగ కార్యాలయాలకు సెలవులు ప్రకటించారు.
తాజా వార్తలు
- ఏపీలో స్ధానిక ఎన్నికలను తాత్కాలికంగా నిలిపేసిన SEC
- మైసూరు దసరాలో వైభవంగా జంబూ సవారి..
- సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్‌తో ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ భేటీ
- దుబాయ్‌లో ఐదు ప్రధాన రహదారులపై వేగ పరిమితుల్లో మార్పులు..
- యూఏఈలో నాలుగు భారతీయ కాన్సులర్ సేవా కేంద్రాల మూసివేత.. అక్టోబర్ 22 నుంచి అమలు
- గల్ఫ్ ఎన్నారైల అభివృద్ధి, ఆర్థిక భరోసాకు APNRT కీలక ఆలోచనలు
- యూఏఈలో రేపు వర్షాలు కురిసే అవకాశం..
- యువత ఉపాధే లక్ష్యమన్న సీఎం రేవంత్
- నిర్లక్ష్యంగా డ్రైవింగ్.. డ్రైవర్‌కు జైలు, కారును ధ్వంసం చేసిన కువైట్ అధికారులు
- అబుదాబిలో షఖ్‌బౌట్ బిన్ సుల్తాన్ వీధిలో మూడు రోజుల పాటు పాక్షిక రహదారి మూసివేత







