రియాద్ ఎక్స్‌పో 2030: సైట్‌ను పరిశీలించిన BIE బృందం
- March 10, 2023
రియాద్ : బ్యూరో ఇంటర్నేషనల్ డెస్ ఎక్స్‌పోజిషన్స్ (BIE) ఎంక్వైరీ మిషన్ సభ్యులు ప్రతిపాదిత రియాద్ ఎక్స్‌పో 2030 సైట్‌ను సందర్శించారు. 6 మిలియన్ చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న వేదిక కోసం రాజధాని మాస్టర్‌ప్లాన్‌ను వారు పరిశీలించారు.KAFD మెట్రో స్టేషన్‌లో రాయల్ కమీషన్ ఆఫ్ రియాద్ సిటీ (RCRC) CEO ఫహద్ అబ్దుల్‌మోహ్సేన్ అల్-రషీద్‌తో కలిసి, BIE బృందం హైటెక్ ప్రజా రవాణా వ్యవస్థను పరిశీలన చేసింద. "మేము రియాద్ సస్టైనబిలిటీ స్ట్రాటజీలో నగరం మొబిలిటీ కార్యక్రమాలలో భాగంగా, రియాద్‌లోని ప్రధాన సైట్‌లు, వసతి హబ్‌లకు దాని కనెక్టివిటీని రాజధాని ఇంట్రాసిటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో ఏకీకృతం చేస్తున్నాము" అని అల్-రషీద్ చెప్పారు. "రాజధాని మౌలిక సదుపాయాలలో ఇటువంటి పెట్టుబడులు, రియాద్ ఎక్స్‌పో 2030 అభ్యర్థిత్వం వెనుక మా నాయకత్వం, అన్ని ప్రభుత్వ సంస్థల మద్దతును ప్రదర్శిస్తాయి" అని ఆయన తెలిపారు.వేగంగా అభివృద్ధి చెందుతున్న నెట్‌వర్క్ ప్రత్యేక అనుభవం కోసం, భవిష్యత్తులో రియాద్ ఎక్స్‌పో 2030 సైట్‌కు సేవలందించే త్వరలో ప్రారంభించబోయే 176-కిమీ పొడవైన రియాద్ మెట్రో నెట్‌వర్క్‌లో BIE ప్రతినిధి బృందం లైన్ 4లో ప్రయాణించి సమీక్షించింది.అనంతరం మధ్యాహ్న భోజన సమావేశంలో రవాణా, లాజిస్టిక్స్ సేవల మంత్రి సలేహ్ అల్-జాసర్, సౌదియా గ్రూప్ డైరెక్టర్ జనరల్ ఇబ్రహీం అల్-ఒమర్, అల్ జాసర్ ప్రతినిధులు పాల్గొన్నారు. తాము ఇప్పటికే దేశవ్యాప్తంగా ఐదు పబ్లిక్ ట్రాన్సిట్ బస్ నెట్‌వర్క్‌లను ప్రారంభించామని, 200 నగరాలు, గవర్నరేట్‌లను కవర్ చేసే ఇంటర్-సిటీ బస్ సర్వీస్ నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేశామని.. గ్లోబల్ కాంపిటేటివ్ రోడ్ కనెక్టివిటీ ఇండెక్స్‌లో USA, స్పెయిన్ తర్వాత కింగ్‌డమ్ మొదటి స్థానంలో ఉందని మంత్రి బృందానికి వివారించారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







