భారత్ జాగృతి కువైట్ ఆధ్వర్యంలో కవిత జన్మదిన వేడుకలు
- March 14, 2023
కువైట్ సిటీ: ఎన్నో మహోన్నత శిఖరాలు అధిరోహించిన మన మూలాలు మర్చిపోవద్దు అనే సంకల్పాన్ని గట్టిగా నమ్మిన నాయకురాలు MLC, భారత్ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలు కువైట్ జాగృతి అధ్యక్షులు ముత్యాల వినయ్ కుమార్ నేతృత్వంలో కువైట్ లో ఘనంగా జరిగాయి.
ఈ సందర్భంగా ముత్యాల వినయ్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ జాగృతి కువైట్ ఈరోజు నుండి భారత్ జాగృతి కువైట్ కి మారిందని కల్వకుంట్ల కవితక్క జన్మదిన సందర్భంగా ఈ విషయాన్ని కువైట్ లో ఉంటున్న తెలుగు మరియు ఇతర రాష్ట్రాల ప్రజలకి తెలియపరిచారు.తెలంగాణ ప్రజలకు ఎటువంటి అవసరం ఉన్నాజాగృతి అండగా ఉంటుందని మరొక్కసారి తెలియజేశారు, ఎటువంటి అవసరం ఉన్న సంప్రదించ వలసిందిగా కోరారు.
కొద్ది రోజులుగా కవిత గారి మీద జరుగుతున్న రాజకీయ దాడులు,తప్పుడు కేసులు తో సతమతం చేస్తూ వస్తున్న కొన్ని దుష్ట శక్తులకు బుద్ది చెప్పాలని,వాటిని ధీటుగా ఎదురుకొనే సామర్థ్యం తమ నాయకురాలు దగ్గర ఉందని , త్వరలోనే అన్ని అవరోధాలు, ఆరోపణలు నుండి విముక్తి చేసుకొని నూతన శక్తి తో మన ప్రియతమ నేత ముందుకు వస్తుందని , ఈ దాడులను ఖండిస్తూ కవిత గారికీ తమ సంపూర్ణ మద్దతు నీ ప్రకటిస్తూ ఎటువంటి సంకట స్థితిలో అయిన జాగృతి కువైట్ తరపున అక్క కి అండగా ఉంటామని అధ్యక్షులు ముత్యాల వినయ్ కుమార్ మరియు జనరల్ సెక్రెటరీ ప్రమోద్ కుమార్ మార్క గారు తెలిపారు.
BRS NRI కువైట్ అధ్యక్షురాలు అభిలాష గొడిశాల మాట్లాడుతూ తెలంగాణ బతుకమ్మను, సంస్కృతి సంప్రదాయాలను ప్రపంచానికి చాటి చెప్పిన ఘనత కవితక్క. మహిళలకు కవితక్క ఒక రోల్ మోడల్ గా నిలుస్తూ, ఢిల్లీలో మహిళా బిల్లు కోసం నిరాహార దీక్ష చేసి పోరాటం చేస్తున్నారు, ఈ మహిళా బిల్లు సాధన కొరకు ఎన్నారై మహిళలందరి తరపున తమ పూర్తి మద్దతు కవితక్కకి ఎప్పుడూ ఉంటుందని తెలియజేశారు.
ఈ వేడుకలలో భారత్ జాగృతి కువైట్ అధ్యక్షులు ముత్యాల వినయ్ కుమార్, ముఖ్య అతిధులుగా BRS NRI కువైట్ అధ్యక్షురాలు అభిలాష గొడిశాల, జనరల్ సెక్రటరీ సురేష్ గౌడ్,ఎరుగట్ల జడ్పీటిసి రాజేష్ గుల్లే, గోల్డెన్ తెలంగాణ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు సుభాన్ సోహెల్, కువైట్ తెలంగాణ సమితి అధ్యక్షులు జీకే గంగాధర్, గల్ఫ్ కాపు సంఘం కువైట్ అధ్యక్షులు జిలకర మురళి రాయల్ కేక్ కట్ చేసి అక్క కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- వాట్సప్ గవర్నెన్స్ తో 751 పౌరసేవలు
- కెనడాలో ఖలిస్థానీ కీలక నేత అరెస్ట్
- ట్రంప్ నిర్ణయాలు..ఇతర దేశాల్లోనూ మెరుగైన అవకాశం
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు …
- షార్జా రాజ కుటుంబంలో విషాదం
- ఇబ్రిలో ట్రక్కులో ఆకస్మికంగా మంటలు..!!
- ఐఫోన్ కొంటున్నారా? నకిలీ ఇన్స్టాగ్రామ్ స్టోర్లపై వార్నింగ్..!!
- ఖతార్ చాంబర్, భారత వ్యాపార ప్రతినిధి బృందం చర్చలు..!!
- సౌదీలో పెరిగిన నిర్మాణ వ్యయ సూచికలు..!!
- అడ్వాన్స్డ్ AI టెక్నాలజీలతో స్మార్ట్ సెక్యూరిటీ పెట్రోల్స్..!!