మహిళా రిజర్వేషన్ బిల్లు పై NRI ల మద్దతు కోసం ఆస్ట్రేలియా లో ప్రచారం..
- March 26, 2023
ఆస్ట్రేలియా: బీ.ఆర్.ఎస్ ఆస్ట్రేలియా మహిళా వింగ్ అధ్యక్షురాలు సంగీత ధూపాటి ఆధ్వర్యంలో సిడ్నీ లోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద గ్లోబల్ NRI కో-ఆర్డినేటర్ మహేష్ బిగాల మహిళా రిజర్వేషన్ బిల్లు పై NRI ల మద్దతు కై ప్రచారాన్ని ప్రారభించారు.
కల్వకుంట్ల కవిత మహిళ రిజర్వేషన్ బిల్లు కోసం చేపట్టిన బృహత్తర కార్యక్రమానికి మద్దతుగా ప్రపంచ వ్యాప్తంగా NRI ల మద్దతు కోసం మొదటిసారిగా ఆస్ట్రేలియా లో ప్రచారం ప్రారంభించామని, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయులు తమ మద్దతు తెలపాలని మహేష్ బిగాల కోరారు.
తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాల విశిష్టతను ఖండాంతరాలకు వ్యాప్తిచెందేలా కృషిచేశారు. నాడు హైదరాబాద్ లాంటి పట్టణాల్లో, విదేశాల్లో ఆత్మన్యూనతకు గురైన బతుకమ్మ నేడు ఆయా దేశాలు బతుకమ్మ పండగను అధికారికంగా నిర్వహించేస్థాయికి తీసుకొచ్చార ని ,ఇప్పుడు మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం దేశవ్యాప్తంగా మహిళలను ఐక్యం చేసి బిల్లు ను సాధిస్తారని బీ ఆర్ ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి తెలిపారు.
సిడ్నీ లో జరిగిన ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ రాజేష్ గిరి రాపోలు, కన్వీనర్ రవిశంకర్ ధూపాటి , లివింగ్స్టున్ చెట్టిపల్లి, అమ్రీన్, గుల్షన్ ఆర, స్వప్న నెల్లీ, పరశురామ్ , అజాజ్, ఇస్మాయిల్, చిరాన్ పురంశెట్టి తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







