గిన్నిస్ రికార్డు సృష్టించిన 4 ఏళ్ల ఎమిరాటీ బాలుడు
- April 01, 2023
యూఏఈ: నాలుగేళ్ళ ఎమిరాటీ బాలుడు సయీద్ రషెద్ అల్ మహీరి.. ఒక పుస్తకాన్ని ప్రచురించిన అతి పిన్న వయస్కుడిగా (మేల్) గిన్నిస్ వరల్డ్ రికార్డ్ (GWR) నెలకొల్పాడు. రెండు జంతువుల మధ్య ఊహించని స్నేహం గురించి 'ది ఎలిఫెంట్ సయీద్ అండ్ ది బేర్' పేరుతో రాసిన ఈ పుస్తకంలో కోపంపై దయ విజయం సాధించడం గురించి సయీద్ రషెద్ అల్ మహీరి చక్కగా రచించాడు. అతని అతిపెద్ద మద్దతుదారు, గురువు అయిన మహిరి 8 ఏళ్ల అక్క అల్దాబీ కూడా ద్విభాషా పుస్తక శ్రేణిని (ఫిమేల్) ప్రచురించిన అతి పిన్న వయస్కురాలిగా రికార్డు సృష్టించింది. అల్దాబీ స్థానికంగా పబ్లిషింగ్ హౌస్ రెయిన్‌బో చిమ్నీ ఎడ్యుకేషనల్ ఎయిడ్స్‌ను నడుపుతున్నది. రెయిన్‌బో చిమ్నీ.. 4-10 సంవత్సరాల మధ్య వయస్సు గల పిల్లలకు వ్రాయడానికి సహాయపడుతుంది. ఇది ఇప్పటికే మూడు పుస్తకాలను ప్రచురించింది. మరో 13 ప్రచురణ ప్రక్రియలో ఉన్నాయి.
తాజా వార్తలు
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!







