వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్ ఫీచర్..
- April 18, 2023
ప్రముఖ మెటా యాజమాన్యంలోని ఇన్‌స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ వాట్సాప్ యానిమేటెడ్ ఎమోజీలను పంపేందుకు యూజర్లను అనుమతించే కొత్త ఫీచర్‌పై పనిచేస్తోంది. ప్రముఖ మెసేజింగ్ సర్వీస్ లేటెస్ట్ డెస్క్‌టాప్ బీటా వెర్షన్‌లో ఈ ఫీచర్ డెవలప్‌మెంట్‌లో గుర్తించింది. యానిమేటెడ్ ఎమోజీలు ప్రస్తుతం టెలిగ్రామ్ స్లాక్ వంటి మెసేజింగ్ సర్వీస్‌లలో సపోర్ట్ చేస్తుంది. ఫీచర్ ట్రాకర్ ప్రకారం.. ఆపిల్ (iOS), (Android) యూజర్ల కోసం వాట్సాప్ బీటా ఫ్యూచర్ అప్‌డేట్ ఫీచర్‌ను యాడ్ చేసే పనిలో ఉంది. వాట్సాప్ కూడా అదే ఫీచర్‌పై పని చేస్తోంది. వాట్సాప్ ప్రస్తుతం స్టిక్కర్లు, GIFలతో పాటు స్టాండర్డ్, స్టాటిక్ ఎమోజీలను పంపేందుకు యూజర్లకు అనుమతిస్తుంది.
వాట్సాప్ ఫీచర్ ట్రాకర్ నివేదిక ప్రకారం.. కొత్త యానిమేటెడ్ ఎమోజీకి సపోర్టును యాడ్ చేయడంలో సర్వీసు అందిస్తోంది. Lottie లైబ్రరీ నుంచి యానిమేషన్లను ఉపయోగించి రూపొందించారు. WABetaInfo ప్రకారం.. కొత్త యానిమేటెడ్ ఎమోజి డిఫాల్ట్‌గా పంపుతారు. అదనంగా, ఈ యానిమేషన్లు సైజులో చిన్నవి. క్వాలిటీ కోల్పోకుండా సైజు మార్చవచ్చు. ప్రస్తుతం అభివృద్ధిలో ఉన్న ఫీచర్ వాట్సాప్ డెస్క్‌టాప్ బీటా వెర్షన్‌లో కనిపించింది. ఈ ఫీచర్ ఇంకా డెవలప్ స్టేజీలో లేదు. చివరకు ఎప్పుడు లాంచ్ అవుతుంది అనేదానిపై ఎలాంటి సమాచారం లేదు.
బీటా ఛానెల్‌లోని యూజర్లు ప్రస్తుతం ఈ యానిమేటెడ్ ఎమోజీలను వినియోగించలేరు. వాట్సాప్ iOS, Android యూజర్లు వాట్సాప్ బీటా ఫ్యూచర్ అప్‌డేట్ అదే ఫీచర్‌ను తీసుకువస్తుందని ఫీచర్ ట్రాకర్ పేర్కొంది. గత నెలలో, ఆండ్రాయిడ్‌లో బీటా టెస్టర్ అప్‌డేట్‌ను ఎంచుకునేందుకు వాట్సాప్ యూనికోడ్ 15.0 ఎమోజీకి సపోర్టు అందించింది. అధికారిక వాట్సాప్ కీబోర్డ్‌కు 21 కొత్త ఎమోజీలను యాడ్ చేసింది. వాట్సాప్ యూజర్లు గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఆండ్రాయిడ్ 2.23.5.13 లేదా నెక్స్ట్ వెర్షన్‌ల కోసం వాట్సాప్ బీటాను డౌన్‌లోడ్ చేయడం ద్వారా ఎమోజీలను యాక్సెస్ చేయవచ్చు.
వాట్సాప్ ఇటీవలే ఆండ్రాయిడ్, iOS డివైజ్‌ల్లో యూజర్లందరికి మూడు కొత్త సెక్యూరిటీ ఫీచర్లను ప్రవేశపెట్టనున్నట్టు ప్రకటించింది. ‘Account Protect’, ‘Device Verification’, ‘automatic security codes’ యాప్‌ను యూజర్లకు సురక్షితమైనదిగా అందిస్తుంది. ‘Device Verification’ ద్వారా యూజర్లను మాల్వేర్‌ను ఇన్‌స్టాల్ చేయకుండా నిరోధిస్తుంది, మెటా యాజమాన్యంలోని మెసేజింగ్ సర్వీస్ ప్రకారం.. అకౌంట్ పాత ఫోన్ నుంచి కొత్త డివైజ్‌కు మైగ్రేట్ అయ్యేందుకు ప్రయత్నిస్తే ‘Account Protect’ యూజర్లను హెచ్చరిస్తుంది.
తాజా వార్తలు
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్‌లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!







