దోహా: ఇండస్ట్రియల్ ఏరియాలో కార్మికులకు ICBF ఇఫ్తార్
- April 19, 2023
దోహా: ఇండియన్ కమ్యూనిటీ బెనివలెంట్ ఫోరమ్ (ICBF), డెసర్ట్ లైన్ గ్రూప్‌లు ఇండస్ట్రియల్ ఏరియా స్ట్రీట్ 38లో ఉన్న లేబర్ క్యాంప్‌లో ఇఫ్తార్ నిర్వహించింది. ఇందులో దాదాపు 2000 మంది కార్మికులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారత రాయబార కార్యాలయ ప్రథమ కార్యదర్శి, ICBF సమన్వయ అధికారి సుమన్ సోంకర్‌తో సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ICBF ప్రెసిడెంట్ షానవాస్ బావ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో డిజర్ట్ లైన్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్, ICBF అడ్వైజరీ కౌన్సిల్ సభ్యుడు అరుణ్‌కుమార్, ఐసిబిఎఫ్ వైస్ ప్రెసిడెంట్ దీపక్ శెట్టి, జనరల్ సెక్రటరీ వర్కీ బోబన్, ఐసిబిఎఫ్ గత ప్రెసిడెంట్ వినోద్ వి నాయర్, ఐసిబిఎఫ్ సెక్రటరీ ముహమ్మద్ కున్హి, మేనేజింగ్ కమిటీ సభ్యులు అబ్దుల్ రవూఫ్, శంకర్ గౌడ్, కుల్దీప్ కౌర్, జరీనా అహద్, ఐసిసి మేనేజింగ్ కమిటీ సభ్యుడు అబ్రహం జోసెఫ్ పాల్గొన్నారు.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)


తాజా వార్తలు
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..







