జనతా గ్యారేజ్ ఆడియో యూఎస్ లో రిలీజ్..
- May 09, 2016
అటు నాన్నకు ప్రేమతో సందడి ముగియకుండానే జనతా గ్యారేజ్ షూటింగ్ స్టార్ట్ అయినట్టుంది గానీ సినిమా రిలీజ్ కు మాత్రం ఇక మూడు నెలలు మాత్రమే మిగిలుంది. షూటింగ్ కూడా దానికి తగ్గట్టే వేగంగానే జరుగుతోంది. మరో వైపు సినిమా కు సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్లు ఎప్పుడు రిలీజ్ అవుతాయా అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారుఎన్టీఆర్ పుట్టినరోజు మే 20న కావడంతో, ఆ రోజున ఫస్టులుక్ ను రిలీజ్ చేయాలనే ఆలోచనలో దర్శక నిర్మాతలు ఉన్నట్టుగా సమాచారం. అలాగే మే 28న మహానటుడు ఎన్టీ రామారావు జయంతి కావడంతో, ఆ సందర్భాన్ని పురస్కరించుకుని, ఈ సినిమా ఫస్టు టీజర్ ను రిలీజ్ చేయాలని అనుకుంటున్నారట.ఈ సినిమా ఆడియో వేడుకను జూలై 15న ఘనంగా నిర్వహించాలనే ఆలోచనలో దర్శక నిర్మాతలు ఉన్నారనేది తాజా సమాచారం. దాదాపు అదే తేదీ ఖరారు కావొచ్చని అంటున్నారు. ఈ చిత్ర ఆడియో ని ఈ చిత్ర యూనిట్ గ్రాండ్ గా రిలీజ్ చెయ్యాలని ప్లాన్ చేస్తున్నారు.ఈ చిత్ర ఆడియో ని యూఎస్ లో రిలీజ్ చెయ్యాలని ఈ చిత్ర నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు అని ఫిలిం నగర్ లో వార్తలు వినిపిస్తున్నాయి.అయితే ఇంకా ఈ విశయంలో ఒక నిర్ణయానికి రాలేదట.యూఎస్ లో ఈ ఆడియో రిలీజ్ ఈవెంట్ కి తెలుగు ఆడియన్స్ భారీగా అటెండ్ అవ్వబోతున్నారు. యూఎస్ లో ఆడియో రిలీజ్ వేడుక జరిగినా కూడా ఈ చిత్ర ఆడియో ని హైదరాబాద్ లో కూడా లోకల్ ఫాన్స్ ని ఆనంద పరిచేలా చెయ్యాలని ప్లాన్ చేస్తున్నారట.ఎన్టీఆర్ సరసన సమంతా,నిత్యామీనన్ కథానాయికలుగా అలరించనున్నారు. ఇక మలయాళ స్టార్ మోహన్ లాల్ ఒక కీలకమైన పాత్రను పోషిస్తోన్న సంగతి తెలిసిందే. ఆగస్టు 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది .
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







