పోలీస్ రుసుముకి హమదాన్ ఆమోదం
- May 10, 2016
క్రౌన్ ప్రిన్స్ ఆఫ్ దుబాయ్ మరియు చైర్మన్ ఆఫ్ దుబాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ షేక్ హమదాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్, పలు సేవలకు సంబంధించి దుబాయ్ పోలీసులు వసూలు చేయాల్సిన ఫీజులకు ఆమోదం తెలిపారు. ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ రిజల్యూషన్ నెంబర్ 15 ఆఫ్ 2016ను ఆయన ఈ మేరకు జారీ చేశారు. దుబాయ్ పోలీసులు మరిన్ని సేవలను పౌరులకు అందించేందుకు వీలుగా ఈ రుసుములను నిర్ణయించారు. లైట్ మరియు హెవీ వెహికిల్స్, మోటర్ బైక్స్కి సంబంధించిన సర్వీసులు ఇందులో పొందుపరచబడ్డాయి. కొత్త అనుమతులు, ట్రాఫిక్ యాక్సిడెంట్ సందర్భంగా ఆ ప్రాంతాల సందర్శన వంటి వాటికీ ఫీజుల్ని వసూలు చేస్తారు. అధికారిక గెజిట్లో ప్రచురితమైనప్పటినుంచి కొత్త కౌన్సిల్ రిజల్యూషన్ అమల్లోకి వస్తుంది.
తాజా వార్తలు
- BD30కే అద్దె కారు.. ప్రమాదంతో BD6,204 జరిమానా..!
- నిత్యావసర వస్తువులు, ఇంధన సరఫరాకు కువైట్ కీలక చర్యలు..!!
- అబుదాబిలో ఘోర రోడ్డు ప్రమాదం.. తల్లి, 15 ఏళ్ల కుమారుడు మృతి..!!
- దుబాయ్లో GTF ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.
- ఖతార్లో అన్ని రంగాల్లో మహిళా సాధికారతకు ప్రోత్సాహం..!!
- ఒమన్లో రాళ్లను ఢీకొని నిలిచిపోయిన పడవ..!!
- సౌదీలో ‘సిక్స్ కింగ్స్ స్లామ్’ వాయిదా.. కొత్త తేదీలు ఇవే..!
- ఇరాన్ పై అతి పెద్ద బాంబు దాడికి అమెరికా ప్లాన్
- షార్జా పోలీసుల భారీ ఆపరేషన్.. సైబర్ నేరాలకు పాల్పడిన నాలుగు ముఠాల గుట్టురట్టు!
- ‘సౌదీ పై దాడులు వెంటనే ఆపాలి’ అంటూ హౌతీలకు భారత్ తీవ్ర హెచ్చరిక







