14 ఏళ్ళ సినీ జీవితం: అల్లరి నరేష్
- May 10, 2016
మొదటి సినిమాలో నటించడం అంటే.. నటుడిగా అప్పుడే జన్మ ఎత్తడం. ఆ లెక్కన చూసుకుంటే అల్లరోడికి అప్పుడే 14 ఏళ్లు నిండిపోయాయి. అవును.. టాలీవుడ్ హీరో అల్లరి నరేష్ మొదటి సినిమా విడుదలై ఇప్పటికి సరిగ్గా 14 ఏళ్లు గడిచిందట. ఆ విషయాన్ని నరేష్ స్వయంగా ట్విట్టర్ ద్వారా తెలిపాడు. 14 సంవత్సరాల క్రితం సరిగ్గా ఇదే రోజు తెలుగు సినిమా పరిశ్రమలో తాను ప్రయాణం మొదలుపెట్టానని, తన అల్లరి సినిమా విడుదలైందని తెలిపాడు.హాస్య భరిత చిత్రాల దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ చిన్న కొడుకుగా తెరంగేట్రం చేసిన నరేష్.. తన మొదటి సినిమా పేరునే ఇంటిపేరుగా మార్చేసుకున్నాడు. కేవలం హాస్య చిత్రాలకే పరిమితం కాకుండా.. తనలోని నటనా నైపుణ్యాన్ని చూపించే వైవిధ్యభరితమైన సినిమాల్లో కూడా నటించి తానేంటో చూపించాడు. ఇన్నాళ్లుగా తనకు అపారమైన మద్దతు ఇచ్చినందుకు అందరికీ ట్విట్టర్ ద్వారా నరేష్ థాంక్స్ చెప్పాడు. ఈ ప్రయాణం చాలా అద్భుతంగా ఉందని కూడా తెలిపాడు.
తాజా వార్తలు
- రియాద్లో మళ్లీ క్షిపణి దాడి.. శకలాలు పడి ప్రవాసికి గాయాలు
- నెట్ఫ్లిక్స్లో భారీ లేఆఫ్స్.. ఉద్యోగులకు షాక్!
- తెలంగాణ పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.. పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలోకి వంగవీటి రాధా
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!







