24 సినిమా కు కేటీఆర్ ప్రశంసలు...
- May 10, 2016
సూర్య హీరోగా తెరకెక్కిన ఎక్స్ పరిమెంటల్ సినిమా 24పై తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ప్రశంసలు కురిపించారు. మంగళవారం ఉదయం ఈ సినిమాను చూసిన ఆయన చిత్రయూనిట్ కు శుభాకాంక్షలు తెలిపారు. సినిమా చూసిన తరువాత 'ఇప్పుడే 24 సినిమాను చూశాను. బ్రిలియంట్ స్క్రీన్ ప్లే, అద్భుతమైన పర్ఫామెన్స్.. నా కూతురు, కొడుకు ఇప్పుడే 24 సినిమాను చూడాలన్నారు' అని ట్వీట్ చేశాడు.సూర్య హీరోగా మనం ఫేం విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ 24. కాలం లో ప్రయాణించటం అనే కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా.. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కి మంచి టాక్ సొంతం చేసుకుంది. ముఖ్యంగా ఆత్రేయ పాత్రలో సూర్య నటించిన తీరు అందరినీ ఆకట్టుకుంటోంది. గత శుక్రవారం రిలీజ్ అయిన ఈ సినిమా ఇప్పటికీ మంచి వసూళ్లను సాధిస్తూ దూసుకుపోతోంది.
తాజా వార్తలు
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!
- యూఏఈ లాటరీలో భారతీయుడికి Dh5 మిలియన్ల జాక్పాట్..!!
- క్యాబిన్ ఎక్సలెన్స్ సెంటర్ ఏర్పాటుకు జీఎంఆర్ ఏరో టెక్నిక్ ఒప్పందం
- మహారాష్ట్ర హైరైజ్ బిల్డింగ్లో అగ్నిప్రమాదం..ఇద్దరు మహిళలు సజీవదహనం
- ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలిగా గౌతమి శ్వేత







