స్విట్జర్లాండ్‌తో బహ్రెయిన్ సంబంధాలు బలోపేతం
- May 13, 2016
బహ్రెయిన్ కింగ్ హమాద్ బిన్ ఇసా అల్ ఖలీఫా, స్విట్జర్లాండ్‌తో తమ దేశం సంబంధాల్ని మరింత బలోపేతం చేసుకోవాలనుకుంటోందని చెప్పారు. స్విట్జర్లాండ్‌లో పర్యటించిన కింగ్ హమాద్, ఇరు దేశాల మధ్యా సాంస్కృతిక, పర్యాటక రంగాలోనూ, వ్యాపార రంగంలోనూ, ఇతరత్రా రంగాల్లోనూ స్విట్జర్లాండ్‌తో సంబంధాల్ని బలోపేతం చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని స్విస్ ప్రెసిడెంట్ జాన్ షినైదర్తో సమావేశం సందర్భంగా వ్యాఖ్యానించడం జరిగింది. అంతర్జాతీయ సమాజంతో అన్ని రంగాల్లోనూ కలిసి నడిచేందుకు బహ్రెయిన్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని కింగ్ హమాద్ వెల్లడించారు. సహనానికి బహ్రెయిన్ రోల్ మోడల్ అనీ, దేశంలో అన్ని మతాలు, వర్గాల వారికి స్వేచ్ఛ ఉంటుందని, ప్రతి ఒక్కరినీ సమ దృష్టితో చూస్తామని కింగ్ హమాద్ చెప్పారు. ఈ సందర్భంగా ఇరు దేశాధినేతల మధ్యా పలు ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. విమెన్ అడ్వాన్స్మెంట్ అండ్ ఎన్హాన్స్మెంట్, విమెన్స్ రైట్స్ విషయంలో పరస్పర సహకారం కోసం ఇరు దేశాల మధ్యా అవగాహనా ఒప్పందం కుదిరింది.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







