నిరుద్యోగులకు గుడ్‌న్యూస్..
- August 18, 2023
అమరావతి: నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ ఛైర్మన్ గౌతమ్ సవాంగ్ గుడ్ న్యూస్ చెప్పారు. సెప్టెంబర్ లోపు మరో గ్రూప్-1 నోటిఫికేషన్ ఇస్తామన్నారు. అలాగే త్వరలోనే గ్రూప్-2 నోటిఫికేషన్ కూడా విడుదల చేస్తామని చెప్పారు. కాగా, గ్రూప్-2 సిలబస్ లో భారీ మార్పులు చేపడుతున్నట్లు వెల్లడించారు.
ఇక, 17ఏళ్ల తర్వాత అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు భర్తీ చేయబోతున్నట్లు వివరించారు. ఇవాళ గ్రూప్ 1 తుది ఫలితాలను గౌతమ్ సవాంగ్ విడుదల చేశారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడారు. కొత్త నోటిఫికేషన్ల గురించి వివరాలు వెల్లడించారు.
గౌతమ్ సవాంగ్, ఏపీపీఎస్సీ ఛైర్మన్ మాట్లాడుతూ "త్వరలో 1,199 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేస్తాం. ఇవి కాకుండా గ్రూప్-1, గ్రూప్-2 పోస్టులకు నోటిఫికేషన్లు త్వరలో విడుదల చేస్తాం. సెప్టెంబర్ లోపు గ్రూప్-1 నోటిఫికేషన్ రిలీజ్ చేస్తాం. త్వరలోనే గ్రూప్-2 ఉద్యోగాలకు నోటిఫికేషన్ నూ విడుదల చేస్తాం. గ్రూప్-1 లో 100 పోస్టులు, గ్రూప్-2 లో వెయ్యి పోస్టులకుపైగా ఖాళీలు భర్తీ చేస్తాం. గ్రూప్స్ సిలబస్ లో మార్పులు చేస్తున్నాం. యూపీఎస్సీ విధానంలో ఏపీపీఎస్సీ నియామక ప్రక్రియ చేపడతాం. నిరుద్యోగులు గ్రూప్స్ ఉద్యోగాలకు సిద్ధం కావచ్చు. ఉద్యోగ నియామకాలపై వదంతులు, తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దు”.
తాజా వార్తలు
- యాంటీడ్రగ్ వ్యతిరేక అవగాహన ప్రదర్శన ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో ‘రీఅష్యూర్డ్ హోమ్స్’ తో కుటుంబాలకు ఉపశమనం..!!
- సమ్మర్ వర్కింగ్ అవర్స్ వయోలేషన్ రిపోర్టుకు ప్రత్యేక ఛానెల్స్..!!
- GMR ఏరోస్పేస్ పార్క్‌లో ఎఫ్‌టీజీ తొలి భారత తయారీ కేంద్రం ప్రారంభం
- అయోధ్య రామాలయ నిధుల స్కామ్ నిందితులు వీరే!
- ఖతార్‌లో నిల్వ ఉన్న ఇరాన్‌కు చెందిన 6 బిలియన్ డాలర్ల నిధులు విడుదల కానున్నాయి: ఇరాన్
- హైదరాబాద్-చెన్నై ఇక 2 గంటల్లోనే!
- కేతన్ అగర్వాల్ హత్య దర్యాప్తులో కొత్త విషయాలు
- హైదరాబాద్‌లో కురవనున్న భారీ వర్షాలు: ఎల్లో అలర్ట్ జారీ
- భూకంపంలో స్టార్ ప్లేయర్ భార్య, ఇద్దరు పిల్లలు మృతి!







