అరబిక్ భాషలో విదేశీ పదాలు.. వ్యతిరేకించిన షార్జా పాలకుడు
- September 13, 2023
యూఏఈ: అరబిక్ భాషలో విదేశీ పదాలను నమోదు చేయడాన్ని షార్జా పాలకుడు తీవ్రంగా వ్యతిరేకించారు. గత నాలుగేళ్లలో నమోదైన అన్ని విదేశీ పదాల గురించి చర్చించేందుకు అక్టోబర్ 2న కైరోలో జరిగే అరబిక్ లాంగ్వేజ్ అకాడమీ సమావేశానికి హాజరుకావాలని భావిస్తున్నట్లు సుప్రీం కౌన్సిల్ సభ్యుడు, షార్జా పాలకుడు హిస్ హైనెస్ షేక్ డాక్టర్ సుల్తాన్ బిన్ ముహమ్మద్ అల్ ఖాసిమి తెలిపారు. అరబిక్ భాషను మార్చడానికి ఎవరూ సాహసించరని అన్నారు. షార్జా బ్రాడ్‌కాస్టింగ్ అథారిటీ యొక్క 'డైరెక్ట్ లైన్' కార్యక్రమంలో షేక్ డాక్టర్ సుల్తాన్ ప్రసంగించిన సమయంలో ఆయన ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. విదేశీ పదాల వాడకం విపరీతంగా పెరిగిపోయిందని ఆయన అన్నారు. కైరోలోని అరబిక్ లాంగ్వేజ్ అకాడమీ సభ్యులుగా విదేశీ పదాలను కలపడంపై పునఃపరిశీలించాలని తాము డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







